Health: జలుబు, దగ్గు, జ్వరం తగ్గట్లేదా..? ఈ ఆహారంతో ఈ మందులు తీసుకుంటే తక్షణ ఉపశమనం
Health: జలుబు, దగ్గు, జ్వరం తగ్గట్లేదా..? ఈ ఆహారంతో ఈ మందులు తీసుకుంటే తక్షణ ఉపశమనం
వెదర్ ఛేంజ్ అవుతోంది.. ఎండా కాలంలో వానలు కురుస్తున్నాయి.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.. సడన్ వెదర్ ఛేంజ్తో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి..
కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భిన్నమైన వాతావరణం నెలకొన్నది. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మందిలో జలుబు, తడి, పొడి దగ్గు, గొంతు, ఒంటి, తలనొప్పులతో పాటు జ్వరం లాంటి లక్షణాలు ఎక్కువగా బయట పడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
2/ 8
దీనిపై పూర్ణియా సివిల్ సర్జన్ డాక్టర్ అభయ్ ప్రకాశ్ చౌదరి కొన్ని సలహాలు ఇచ్చారు. ఈ సలహాలు పాటించడం ద్వారా మీ ఆరోగ్యం కాస్త బెటర్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
3/ 8
వైరల్ ఫ్లూతో బాధపడుతుంటే నివారించాలని, పౌష్టికాహారంతో పాటు ఈ మందులు తీసుకోవాలని సివిల్ సర్జన్ చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
4/ 8
జలుబు, దగ్గు, జలుబు, జ్వరం గురించి భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ అభయ్ ప్రకాశ్ చెబుతున్నారు. మీకు ముక్కు కారటం సమస్య ఉంటే, మీరు సెటిరిజైన్ ట్యాబ్ లేదా ఫెక్సోఫెనాడిన్ ట్యాబ్ తీసుకోవచ్చు.. అయితే అతిగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
5/ 8
రెండు వారాల కంటే ఎక్కువ కాలం జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలుంటే నేరుగా వైద్యుడిని కలవాలని సూచిస్తున్నారు. అవి టైఫాయిడ్ లేదా మలేరియా లక్షణాలు కావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
6/ 8
జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు చాలా మందికి తెలియకుండానే అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ తీసుకుంటారని.. ఇలా చేయడం ఆపేయాలన్నారు. యాంటీబయాటిక్ మెడిసిన్ కేవలం డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
7/ 8
మరోవైపు కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల్లో కాస్త పెరుగుదల కనిపిస్తున్నది. విటమిన్-బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వాడటం, గోరువెచ్చని నీరు తాగాలి. తాజా, వేడి ఆహారమే తీసుకోవాలి. తీవ్రమైతే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)
8/ 8
శరీరానికి మంచినీరు ఎంతో అవసరం. పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. అప్పుడు శరీరం వ్యాధితో సమర్థంగా పోరాడగలదు. కోల్పోయిన నీటి శాతం వెంటనే భర్తీ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం Image credit unsplash)