డయాబెటీస్ : డయాబెటీస్ పేషెంట్లు కూడా మతిమరుపు సమస్యతో బాధపడే అవకాశం ఉంది. వీరి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటే మాత్రం బ్రెయిన్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని మతిమరుపు సమస్య వస్తుంది. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవాలి.