3.అవిసె గింజలు.. Ayurvedic plants for home: అవిసె గింజలకు రక్తపోటు, ఊబకాయాన్ని తగ్గించే శక్తి ఉంది. మీరు దీన్ని సలాడ్ డ్రెస్సింగ్‌గా తినవచ్చు. అవిసె గింజలు మహిళల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. అవిసె గింజలను వేయించి లేదా ఉడికించి తినాలి. అంతేకాదు, హెయిర్ సంబంధిత సమస్యలకు కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీన్ని నిపుణులు సైతం సూచిస్తున్నారు. Image : shutterstock
4.టీ- ట్రీ ప్లాంట్.. Ayurvedic plants for home: టీ ట్రీ ఆయిల్ మొటిమలు కలిగించే సూక్ష్మజీవుల పెరుగుదలను నెమ్మదిస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా ముఖ్యమైన నూనెగా ఉపయోగించబడుతుంది. టీ ట్రీ ఆయిల్ ను మనం కొనాలన్నా వాటి ధరలు కూడా కాస్త ఎక్కవుగానే ఉంది. అందుకే మనం వీటిని ఇంట్లో పెంచుకుంటే బెనిఫిల్స్ భలే ఉంటాయి. Image : shutterstock
5.పసుపు.. Ayurvedic plants for home: పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి, DNA ఉత్పరివర్తనాలను నిరోధించవచ్చు. అదనంగా, ఇది యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంది. జాయింట్ ఆర్థరైటిస్‌ను నయం చేయడంలో ఇది చాలా మేలు చేస్తుంది..పసుపును మన భారతీయుల పూర్తీకుల కాలం నుంచి విరివిగా వాడతారు. కరోనా సమయంలో మరింతగా వినియోగం పెరిగింది. Image : shutterstock
6.తులసి మొక్క.. Ayurvedic plants for home: పవిత్ర తులసి మొక్క పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో విటమిన్ సి, క్యాల్షియం, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)