Online Shopping | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతున్నాయి. ఈ ఫెస్టివల్ సేల్‌లో మీరు ఫుట్‌వేర్ కొంటున్నారా? ఆన్లైన్లో చెప్పులు కొనేప్పుడు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మరి ఆన్లైన్లో ఫుట్‌వేర్ కొనేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకోండి.
1. మీరు తరచూ ఆన్లైన్లో ఫుట్‌వేర్ కొంటుంటారా? అయితే కాస్త జాగ్రత్త. ఆన్లైన్లో ఏ వస్తువులు కొన్నా కాస్త అటుఇటుగా ఉన్నా వాడుకోవచ్చు. కానీ ఫుట్‌వేర్ విషయంలో రిస్క్ చేయడం కష్టం. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
2. ఆన్లైన్లో చూడగానే బాగుంది కదా అని ఫుట్‌వేర్ కొన్నారంటే ఆ తర్వాత మొదలవుతాయి కష్టాలు. మీరు ఆర్డర్ చేసిన ఫుట్‌వేర్ కాళ్లకు సరిపోతాయో లేదో తెలియదు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
3. దుస్తులైనా, ఫుట్‌వేర్ అయినా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా దొరకవు. ఆన్లైన్లో అయితే సైజుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
4. ఆన్లైన్లో ఫుట్‌వేర్ ఆర్డర్ చేసే ముందు సైజ్ చార్ట్ చెక్ చేయడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
5. ఫుట్‌వేర్ కొలతలు 5 రకాలుగా ఉంటాయి. సెంటీమీటర్స్, ఇంచెస్, యూకే, యూఎస్, ఈయూ నెంబర్స్ కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
6. ఇండియన్ ఫుట్‌వేర్ సైజులకు, గ్లోబల్ సైజులకు తేడా ఉంటుంది. ఆ తేడాలు తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
7. మీరు తరచూ ఏ సైజ్ ఫుట్‌వేర్ కొంటారో ఆ సైజ్ ప్రిఫర్ చేయండి. కాస్త అటుఇటుగా ఉన్నా కొనకపోవడం మంచిది. అంటే మీ కాలి సైజ్ 7 అయితే 7.5 ట్రై చేయొద్దు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
8. సైజుల విషయానికి వచ్చేసరికి కొన్ని బ్రాండ్స్‌లో తేడా ఉంటుంది. ఓ బ్రాండ్‌లో మీకు 7 సైజ్ రావొచ్చు. మరో బ్రాండ్‌లో 8 సైజ్ సరిపోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
9. హీల్స్, శాండిల్స్ అయితే మీ సౌకర్యాన్ని చూసుకొని ఆర్డర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
10. ఆన్లైన్లో ఫుట్‌వేర్ కొనేప్పుడు తెలిసిన బ్రాండ్స్ ఎంచుకోవడమే మంచిది. కొత్త బ్రాండ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం మొదట షాపులోనే కొనాలి. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 11
11. సైజ్ ఏమాత్రం తేడా అయినా కాళ్లకు కంఫర్ట్‌గా ఉండదు. అందుకే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసేముందు ఎక్స్ఛేంజ్ లేదా రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో చూసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)