ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ గుడి వెనక ఆసక్తికర చరిత్ర ఉంది. 1956లో బ్రహ్మాజీ ఆలయాన్ని నిర్మించారు.ఆలయం లోపల బ్రహ్మ దేవుడి చతుర్ముఖ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని బంగారంతో తయారు చేశారు.
దుష్ట శక్తులను తరిమికొట్టేందుకే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడి స్థానికులు చెబుతారు. ఈ గుడికి సంబంధించి మరో చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. దాని ప్రకారం 1950లో ఇరాన్ అనే హోటల్ నిర్మాణం ప్రారంభమయిందట.
అయితే ఆలయ నిర్మాణ సమయంలో ఎన్నో అవాంతరాలు, విచిత్ర సంఘటనలు జరిగాయి. ఆలయ నిర్మాణానికి పని చేసిన ఎంతో మంది కూలీలు వేర్వేరు కారణాలతో చనిపోయారు. దాంతో ఆ స్థలంలో దుష్టశక్తులు ఉన్నాయని అక్కడి ప్రజలు భావించారు.
ఈ పరిణామాల అనంతరం హోటల్ నిర్మాణాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత మహాప్రోమ్ అనే జ్యోతిషుడి సూచన మేరకు ఆ స్థలంలో గుడిని నిర్మించారు. గుడి నిర్మాణం పూర్తయ్యాక.. అప్పుడు ఇరావన్ హోటల్ ను నిర్మించారు. ఈ సారి ఎలాంటి అవాంతరాలు లేకుండానే హోటల్ నిర్మాణం పూర్తయింది.