మన చుట్టూ ఉన్న సమాజంలో కొంత మంది.. బాణామతి, చిల్లంగి, క్షుద్రపూజలు వంటివి చేస్తారు. లేదా దిష్టి తీసి.. రోడ్డుపై పడేస్తారు. అలాంటి వాటి ప్రభావం మనుషులపై పడితే.. ఆ మనుషులు ఉన్న ఇంట్లో దరిద్రం తాండవిస్తుందనీ, అన్నీ చెడులే జరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆ సమస్యలకు విరుగుడుగా నల్ల పసుపు కొమ్ములను వాడుతారు.
ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులను లాగేసుకునే శక్తి.. నల్ల పసుపు కొమ్ములకు ఉందని నమ్ముతారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా వీటిని పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తాంత్రిక పూజల్లో కూడా ఈ నల్ల కొమ్ములను ఉపయోగిస్తారు. ఎవరికైనా దెయ్యం పడితే... దాన్ని వదిలించేందుకు కూడా ఇవి పనిచేస్తాయని చెబుతున్నారు.