మగాళ్లు ఏడ్చినంత మాత్రాన సిగ్గుపడాల్సిందేమీ లేదు. ఏడుపు అనేది బాధను వ్యక్తపరిచే ఒక ఫీలింగ్ మాత్రమే. ఏడుపు ఏ ఒక్క జెండర్ సొత్తూ కాదు. ఏడుపొస్తే ఏడవాలి.. అది ఆడవాళ్లైనా.. మగవారైనా కూడా. నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదు లాంటి సామెతలకు చరమగీతం పాడక తప్పదు. (Image credit- Yosi Prihantoro Instagram)
ఏడుపు విషయం నుంచి ప్రతి విషయంలోనూ సమాజం తెలయకుండానే మగవారి మెంటల్ హెల్త్‌ను పాడుచేస్తోంది. పక్కింటి అబ్బాయి చూడు అప్పుడే ఉద్యోగం తెప్పించుకున్నాడు ? ఎదురింటి వాళ్ల అబ్బాయి చూడు ఎంత సంపాదిస్తున్నాడో ? ఏంటీ నర్సు అవుతావా? టీచర్ అవుతావా? అవి ఆడపిల్లల మగపిల్లోడివి నీకెందుకు? చక్కగా హాయిగా పోలీసో, ఇంజినీరో అవ్వకుండా? భార్యను అదుపులో పెట్టలేనివాడివి నీవేం మగాడివి రా బాబు ? భయం అనేది అబ్బాయిల లక్షణం కాదు అంటూ చిన్నప్పటీ నుంచే వారికి నూరిపోస్తున్నాము. (Photo by Gabriel on Unsplash)
అబ్బాయిల పెంపకంలో మగతనం అనే పదం చేర్చడం వలన జీవితంలో వారికి బాధ కలిగినప్పుడు బయటకు చెప్పుకోలేకపోవడం, తన తోటి వారితో సమానంగా సంపాదించలేకపోతున్నామనే ఆత్మనూన్యతా భావంతో తమలో తాము కృంగిపోవడం, వైఫల్యాలనుని హ్యాండిల్ చేయలేక తాగుడు లాంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు పురుషులు. (Photo by Mahdi Bafande on Unsplash)
అటు తన కష్టాలను చెప్పుకోవడానికి నమోషిగా ఫీల్ అవ్వడం వలన ఆత్మహత్యలకు పాల్పడటం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మన బాధను పంచుకునేందుకు ఎవరు లేనప్పుడు..బాధను వ్యక్తపరుకోలేనప్పుడు సూసైడ్ ఆలోచనలు వస్తాయన్నది నిపుణుల మాట. అందుకే బాధ వస్తే ఏ జెండర్ వారైనా ఏడిస్తే మంచిది. (Photo by Francisco Gonzalez on Unsplash)
అనుకోని ఘటనలతో, లవ్ ఫెయిల్‌తో లేదా కెరీర్లో ఏం సాధించలేకపోతున్నామని మనసు నలిగిపోయినప్పుడు భరించలేని బాధ కలగడం సహజం. అలాంటప్పుడు ఏడిస్తే తప్పేంటి..? జెండర్ ఈక్వాలిటీ అనేది కేవలం ఆడవారికి మాత్రమే చెందిన అంశం కాదు. మన సమాజ శ్రేయస్సుకు సంబంధించినది, అందరికీ సంబంధించింది. (Photo by Stormseeker on Unsplash)