జలుబు చికాకు పెడుతోందా.. ఇలా చేస్తే త్వరగా ఉపశమనం..
జలుబు చికాకు పెడుతోందా.. ఇలా చేస్తే త్వరగా ఉపశమనం..
Cold remedies: వర్షాలు ముసురుతుంటే.. జలుబు, దగ్గు సమస్యలు వేధించడం కామన్. అయితే కొన్నిసార్లు ఎన్ని మందులు తీసుకున్నా ఈ సమస్య తగ్గదు.. అలాంటి సమయంలో ఇలాంటి చిట్కాలు పాటిస్తే జలుబు నుంచి ఉపశమనం తప్పనిసరి.
1/ 7
తులసి రసం లేదా తులసీ ఆకులని రోజూ ఉదయాన్నే తీసుకోవాలి.
2/ 7
అల్లంని వేడినీటిలో మరిగించి ఆ నీటిని తాగుతూ.. అల్లంని నమిలి మింగాలి.
3/ 7
వాముని కొద్దికొద్దిగా నములుతుండాలి.
4/ 7
రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో కాస్త పసుపు కలిపి తాగాలి.
5/ 7
కర్పూరాన్ని నువ్వులనూనెలో కరిగించి దాంతో తల, ఛాతీ, పాదాలకు మసాజ్ చేస్తూ ఉండాలి.
6/ 7
నల్లమిరియాలతో కషాయం చేసుకుని తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది.
7/ 7
వేడినీటిలో కాసింత పసుపు, కర్పూరం వేసి ఆవిరిపట్టాలి.