ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే... టీ తాగితే తప్పేంటి? టీ తాగితే పెద్దగా నష్టం ఏమీ ఉండదు. అందుకే టీ.. మన జాతీయ పానీయం అయ్యింది. ఐతే.. కొంతమందికి తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది. అలాంటి వారు టీని ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే అందులోని కెఫైన్ (caffeine)... వారికి తలనొప్పిని తాత్కాలికంగా తగ్గిస్తూ.. దీర్ఘకాలంలో అదో మత్తు పదార్థంలా మారి.. టీ తాగకపోతే.. తలనొప్పి పెరిగే పరిస్థితి తేగలదు. అందువల్ల టీ అందరికీ శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.
అన్ని టీలలోనూ కెఫైన్ ఒకే రకంగా ఉండదు. తేయాకు ఏ రకం? తేయాకును ఎలా ఉడికించామన్న దాన్ని బట్టీ.. కెఫైన్ ఎంత ఉంది అనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్లాక్ టీలో కెఫైన్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత గ్రీన్ టీ, వైట్ టీ, ఊలాంగ్ (oolong) టీలో కెఫైన్ ఎక్కువగా ఉంటుంది. టీ తాగడం మీకు సమస్యే అనుకుంటే.. మీరు టీ బదులు ఈ కింది డ్రింక్స్ తాగవచ్చు.