ఈ సీజన్లో మండిపోతున్న ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే ఫ్యాన్లు ఉంటే సరిపోదు. పేద,మధ్య తరగతి ప్రజలు ఏసీగా ఫీలయ్యే మంచి కూలర్ ఉండాల్సిందే. అయితే అతి తక్కువ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉన్న కూలర్లు ఏంటో ..? వాటి ధర ఎంతో ?తెలిస్తే షాక్ అవుతారు. నిజమా ఐదు వెల రూపాయలకే కూలర్ వస్తోంది. అలాంటి ఐదు కంపెనీలకు చెందిన కూలర్ల డీటెయిల్స్ ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. వాటిని ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. పెర్ఫామెన్స్ పరంగా అద్భుతంగా ఉండటమే కాదు, వారి లుక్స్ కూడా వేరే కూలర్ల కంటే డిఫరెంట్గా ఉన్నాయి.
Croma Arctic CRRC1203 22 L Personal Air Cooler- ఇది చల్లటి గాలిని ఇచ్చేందుకు కూలర్ లోపల మంచు గదిని కలిగి ఉంటుంది. అందులో తేనెగూడు కూలింగ్ ప్యాడ్స్ కూడా అమర్చారు. దీన్ని ఇన్వర్టర్తో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో 22లీటర్ల నీరు పట్టేలా ట్యాంక్ సామర్ద్యాన్ని తయారు చేశారు. ఈ కూలర్ ధర 2994 రూపాయలు మాత్రమే.
Kenstar Nix 12 L Personal Air Cooler - దీనికి ధర వచ్చేసి 3690 రూపాయలు. ఈ కూలర్ నుంచి వచ్చే చల్లని గాలి దాదాపు 10 అడుగుల వరకు వీస్తుంది. ఈ కూలర్లో డస్ట్ ఫిల్టర్ కూడా ఉంది.ఈ చీప్ అండ్ బెస్ట్ కూలర్కి ఒక సంవత్సరం వారెంటీ కూడా ఉంది. కూలర్ చిన్నదిగా ఉంటుంది. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ కేవలం 12 లీటర్లు మాత్రమే. ఇందులో మీకు ఐస్ చాంబర్ ఉంది.
Crompton Ginie Neo 10 L Personal Air Cooler- ఈ కూలర్ నుంచి వచ్చే చల్లని గాలి దాదాపు 35 అడుగుల వరకు వీస్తుంది. దీని ట్యాంక్ 10 లీటర్లు. ఇది కేవలం ముందు భాగం మాత్రమే కాకుండా చుట్టు పక్కలకు గాలిని పంచుతుంది. ఇందులో కూడా ఐస్ చాంబర్ ఉంది. ఈ కూలర్కి 5స్టార్ రేటింగ్ ఉంది. ఈ కూలర్ వాడటం కారణంగా తక్కువ కరెంట్ కలుతుంది.