Beauty Tips : స్కిన్ గ్లోను పెంచే ఆహార పదార్థాలు.. వీటిని తింటే క్రీములను వాడాల్సిన అవసరమే ఉండదు
Beauty Tips : స్కిన్ గ్లోను పెంచే ఆహార పదార్థాలు.. వీటిని తింటే క్రీములను వాడాల్సిన అవసరమే ఉండదు
Beauty Tips : మార్కెట్లో చర్మ సౌందర్యాన్ని పెంచే క్రీములను ఫుల్ డిమాండ్. అయితే ఈ క్రీములతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎటువంటి క్రీములను ఉపయోగించకుండా ఆహారపు అలవాట్లతో మన చర్మాన్ని మెరిసేలా చేయొచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అందానికి ప్రాధాన్యం ఇవ్వడంలో యువత ఎప్పుడూ ముందుంటుంది. మార్కెట్లో చర్మ సౌందర్యాన్ని పెంచే క్రీములను ఫుల్ డిమాండ్. అయితే ఈ క్రీములతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఎటువంటి క్రీములను ఉపయోగించకుండా ఆహారపు అలవాట్లతో మన చర్మాన్ని మెరిసేలా చేయొచ్చు. మెరిసే అందం కోసం తినాల్సిన 6 ఫుడ్ ఐటెమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
క్యారెట్ : క్యారెట్స్ మీ చర్మాన్ని కాపాడుతుంది. సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు (UV)ల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. క్యారెట్ తినడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
దోసకాయ : దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ‘సి’, ‘కె’లు కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ.. మెరిసేలా చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
కొబ్బెర : కొబ్బెర శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. డ్రై స్కిన్ తో బాధ పడేవారికి కొబ్బెర ఔషధంలా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
గుమ్మడి కాయ : గుమ్మడియాలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేయడంలో గుమ్మడికాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
స్ట్రాబెర్రీస్, అవకాడోలను తినడం ద్వారా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్ ‘సి’ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇక అవకాడోలో ఉండే కొవ్వు చర్మాన్ని పాడవకుండా కాపాడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)