తీవ్రమైన ఎండలో తిరిగితే... ఎలాంటి వాళ్ల చర్మమైనా కందిపోవడం ఖాయం. సూర్య కిరణాలు డైరెక్టుగా స్కిన్‌పై పడినప్పుడు... ఆ వేడిని తట్టుకోవడానికి శరీరం... మెలనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది చర్మంపై పొరలా ఏర్పడుతుంది. ఈ మెలనిన్ నల్లగా ఉంటుంది. ఇది ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే... స్కిన్ గ్లో అంతగా తగ్గిపోతుంది. దీన్ని అలాగే వదిలేస్తే... స్కిన్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. దీనికి విరుగుడు నారింజ పండు. (ప్రతీకాత్మక చిత్రం)
ఓ టేబుల్ స్పూన్ నారింజ తొక్క పొడి తీసుకొని... అందులో కొద్దిగా పసుపు, కాలమైన్ పొడి (calamine powder) లేదా గంధపు పొడి (sandalwood powder) వేసి, కొద్దిగా నీరు పోసి పేస్టులా కలపాలి. చర్మం ఎక్కడ కందిపోయిందో, ఎక్కడ కాంతి తగ్గిపోయిందో అక్కడ రాసుకోవాలి. 5 నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకుంటే... చర్మం మళ్లీ పూర్వంలా మెరుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)