పెరుగు: ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసిన లేదా దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోకుడదు. ఇందులో ఉండే బాక్టీరియా కడుపులోని యాసిడ్లకు ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి ఖాళీ కడుపుతో వీటని తీసుకోకండి.ఉదయం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్న తర్వాత, కొంత సమయం తర్వాత పెరుగు తినవచ్చు.
పచ్చి కూరగాయలు: వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే, ఖాళీ కడుపుతో కూరగాయలు తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అల్పాహారంలో కూరగాయలను తీసుకోవచ్చు. కేవలం ఖాళీ కడుపుతో కూరగాయలు తినవద్దు. సరైన సమయంలో సరైన ఆహారాన్ని ఎంచుకోవడం, తినడం ద్వారా చాలా ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించవచ్చు.
అరటిపండు: చాలా మంది ఆకలిని తగ్గించుకోవడానికి అరటిపండు తింటారు. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. అరటిపండ్లలో మెగ్నీషియం మరియు పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల రక్తంలో మెగ్నీషియం , పొటాషియం స్థాయిలలో అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి అనవసరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు.