[caption id="attachment_1598382" align="alignnone" width="1204"] వేడి వేడి టీ తాగొద్దు: చాలా వేడిగా ఉండే టీ తాగడం ఏ మాత్రం మంచిది కాదు. మనం ఊహించిన దానికంటే చాలా ప్రమాదకరమైన అలవాటు ఇది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ అధ్యయనం ప్రకారం.. 60 డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద రోజుకు 700 మిల్లీలీటర్లు లేదా అంతకంటే ఎక్కువ టీ తాగడం వల్ల మీ భవిష్యత్తులో ఈసోఫెగల్(oesophageal) క్యాన్సర్ బారిన పడే అవకాశాలు 90 శాతం పెరుగుతాయట. అందుకే కాస్త చల్లారిన తర్వాతే టీ తాగండి.
[caption id="attachment_1598384" align="alignnone" width="1024"] ఆల్కహాల్: మద్యపానం క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఇదే ప్రధాన కారణమని చాలా అధ్యయనాలు తేల్చాయి. కాక్టెయిల్స్ లేదా వైన్ జోలికి అసలు పోవద్దు. క్యాన్సర్ రీసెర్చ్ యూకే ప్రకారం.. అధిక ఆల్కహాల్ వినియోగం నోటి క్యాన్సర్, ఫారింజియల్ క్యాన్సర్(pharyngeal cancer), రొమ్ము క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అటు మద్యపానం వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు వచ్చే అవకాశం 75శాతం వరకు ఉంటుంది.
[caption id="attachment_1598386" align="alignnone" width="1000"] నైట్ షిఫ్ట్: మీరు రోజు నైట్ షిఫ్ట్‌లోనే పని చేస్తున్నారా..? అయితే జాగ్రత్త పడండి. కాస్త షిఫ్ట్ టైమింగ్స్ వారం వారానికి మార్చుకొండి. చాలా కాలం పాటు నైట్ షిఫ్ట్‌లో పనిచేయడం మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్, ప్రివెన్షన్ నివేదిక ప్రకారం.. రెగ్యూలర్‌గా నైట్ షిఫ్టులలో పని చేయడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
[caption id="attachment_1598388" align="alignnone" width="960"] స్మార్ట్‌ఫోన్: స్మార్ట్‌ఫోన్ లేకపోతే రోజు గడవదు..ప్రతి నిమిషం అది మన చేతుల్లో ఉండాల్సిందే...! అయితే స్మార్ట్ ఫోన్ వినియోగాని వీలైనంత తగ్గించాలంటున్నారు డాక్టర్లు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్ అధ్యయనం ప్రకారం.. ఎక్కువగా సెల్‌ఫోన్ వాడకం క్యాన్సర్ ప్రమాదానికి దారి తీస్తుంది. అధిక స్థాయిలో రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్(RFR)కి గురికావడం వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు.
[caption id="attachment_1598390" align="alignnone" width="1044"] ప్లాస్టిక్ బాటిల్స్ రీ యూజ్: ప్లాస్టిక్ బాటిల్స్ రీ యూజ్ చేయడం ఏ మాత్రం సేఫ్ కాదు. మీ వాటర్ బాటిళ్లను రీ యూజ్ చేయడం పర్యావరణ అనుకూలమని మీరు అనుకోవచ్చు. కానీ అది మీ శరీరంలోకి హానికరమైన కెమికల్స్‌ను తీసుకెళ్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్గనైజేషన్( Breastcancer.org) నివేదిక ప్రకారం.. ప్లాస్టిక్‌లను రీ యూజ్ చేయడం వల్ల రొమ్ము(breast) క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాఫీ ఎక్కువగా తాగడం: కాఫీ తాగనిదే రోజు ప్రారంభించరు కొందరు. అయితే ఈ అలవాట్లను కొంచం మార్చుకొండి. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. కాఫీలో అక్రిలామైడ్ అనే రసాయనం ఉంటుంది. ఇది మీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాఫీ తగడాన్ని వీలైనంత తగ్గించండి. గ్రీన్ టీని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి.