Blood Improving Food: శరీరంలో రక్తం తక్కువగా ఉందా ?.. వీటిని తింటే చాలు..
Blood Improving Food: శరీరంలో రక్తం తక్కువగా ఉందా ?.. వీటిని తింటే చాలు..
Lack of Blood: ఎక్కువ రోజులు రక్తహీనత సమస్య కొనసాగితే.. ఆ తరువాత ఇతర సమస్యలు వచ్చిపడతాయి.
1/ 8
మనలో కొంతమందిలో రక్తం తక్కువగా ఉంటుంది. దీన్నే ఎనిమియా అంటారు. అమ్మాయిల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించినా.. కొంతమంది అబ్బాయిలు, పిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంటుంది.
2/ 8
ఎక్కువ రోజులు రక్తహీనత సమస్య కొనసాగితే.. ఆ తరువాత ఇతర సమస్యలు వచ్చిపడతాయి. అయితే మంచి ఆహారం, రక్తం పెంపొందించే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని డాక్టర్లు, డైట్ స్పెషలిస్టులు సూచిస్తున్నారు.
3/ 8
టమాటాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఉదయాన్నే 4 నుంచి 5 టమాటల నుంచి జ్యూస్ తీసుకుని తాగాలి. సూప్‌లా చేసుకుని కూడా తాగొచ్చు.
4/ 8
ఇక రక్తం పెరగడానికి దోహదం చేసే మరో పదార్థం బీట్ రూట్. సలాడ్‌లా చేసుకుని దీన్ని తీసుకోవచ్చు. దీన్ని తియ్యగా మార్చుకునేందుకు ఇందులో కొంచెం బెల్లం కలపవచ్చు. దీని వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.
5/ 8
విటమిన్ బి6, ఏ, సి, ఐరన్, కాల్షీయం, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉండే పాలకూర తీసుకోవడం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
6/ 8
ఇక రక్తహీనత నుంచి బయటపడేందుకు యాపిల్ కూడా మంచి ఔషధంగా పని చేస్తుంది. రోజూ ఒక యాపిల్ తినడం ద్వారా అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తుంటారు.
7/ 8
జామపండ్లు తీసుకోవడం ద్వారా కూడా ఎనిమియా సమస్యకు చెక్ చెప్పొచ్చు. రోజూ ఈ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తహీనతను అధిగమించవచ్చు.
8/ 8
దానిమ్మపండ్లు తినడం ద్వారా శరీరంలో రక్తం పెంపొందించుకోవచ్చు. అందుకే డైట్లో దీన్ని భాగం చేసుకోవాలి.