మేషం (Aries):
ఈ రాశివారు జీవితంలోనే కాదు రిలేషన్షిప్ (Relationship) విషయంలోనూ నిర్లక్ష్యంగానే ఉంటారు. హఠాత్తు నిర్ణయాలు తీసుకుంటుంటారు. జీవితంలో కొత్తదనం కావాలని అనుకునే వీరికి బంధాన్ని నిలుపుకోవడం చేతకాదు. రిలేషన్షిప్లో ఒకే వ్యక్తితో సంబంధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. అది మేషరాశివారు చేయలేరు.
మిథునం (Gemini):
వీళ్లు రెండు రకాల వ్యక్తిత్వాలు (Personalities) కలిగి ఉంటారు. వీళ్లు అంత నమ్మదగినవారు కాదు. ఈ రాశివారితో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే వీళ్లు ఒంటరి తోడేలు లాంటివారు. వీరికి సాహసాలన్నా, స్పాంటేనిటీ అన్నా ఇష్టం. ఇవి స్ట్రాంగ్ రిలేషన్షిప్ కలిగి ఉండేందుకు వారిని వెనుకాడేలా చేస్తాయి. ఇంకా చెప్పాలంటే, వీరు మీ ప్రేమకు, విశ్వాసానికి సరితూగలేరు.
కన్య (Virgo):
ఈ రాశివారు పార్టనర్‌కు సంతోషంగా, క్షేమంగా ఉండేవరకూ దేన్నీ ఆపరు. వీరికి కరుణ ఎక్కువ. పార్టనర్‌ని గ్రహించి, దాన్ని బట్టి నడుచుకుంటారు. అయితే ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం వల్ల చాలా మందితో `వద్దుబాబోయ్` అనిపిచ్చుకుంటారు. ఈ విషయంలో వీళ్లు రిలేషన్ షిప్ ని కోల్పోవడం జరుగుతుంది.
తుల (Libra):
వీళ్లు తమ పార్టనర్ తమ పట్ల ఉదారంగా ఉండాలనీ, వీరిని ప్రత్యేకంగా చూడాలని అనుకుంటారు. ముఖ్యంగా బహుమతుల దగ్గర ఇలాంటి భావన ఎక్కువగా ఉంటుంది. వీళ్లు ఇచ్చిపుచ్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వీరికి బ్యాలన్స్‌గా ఉండటమే ఇష్టం. వీరి ప్రాధాన్యతలు చాలా హెచ్చులో ఉండటం వల్ల పార్టనర్‌కి సహకరించడం ఎంతో కష్టం.
వృశ్చికం (Scorpio ) :
వీళ్లు ఓవర్ ఎమోషనల్‌గా ఉంటారు. వీరికి ఇతరులంటే ఈర్ష్య ఎక్కువ. వారి పార్టనర్‌ని ఇంకొకళ్లు ఎత్తుకెళ్లిపోతారనే అనుమానం ఎక్కువ. వీరిలో ఉన్న ఈ నెగెటీవ్ క్వాలిటీ పార్టనర్ కి, ఊపిరాడనీయకుండా చేస్తుంది. అంతేకాక, ఈ రాశివారికి రిలేషన్షిప్లో వారు అనుకున్నది దొరక్కపోతే పార్టనర్‌ని వదిలేయడానికి ఏమాత్రం సంకోచించరు.
ధనుస్సు( Sagittarius ):
వీళ్లు చాలా కరకుగా, కఠినంగా ఉండేవారు. ఏదేమైనా వీళ్లు రిలేషన్‌షిప్‌ను దూరంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు. కొన్ని రోజులుండే రిలేషన్షిప్, క్యాజువల్ రిలేషన్షిప్లో మాత్రమే వీరికి ఇష్టం. నిజానికి ఈ రాశి వారికి తమపైన తమకే నమ్మకం ఉండదు. ఇదే వారి పార్ట్నర్ (Partner)కి పిచ్చిపట్టేటట్లు చేస్తుంది. మానసికంగా కుంగదీస్తుంది.
మకరం (Capricorn):
వారి ప్రేమ కష్టంగా ఉంటుంది. ఎంతో పద్ధతిగా, బాస్‌లాగా ఉండాలనుకుంటారు. నిజానికి పార్టనర్ విషయంలో వీళ్లు ఎంతో సున్నితంగా ఉంటారు. ఆశ్చర్యమేమంటే వీళ్లు రొమాంటిక్ కానేకాదు. అయితే కంఫర్ట్ జోన్ నుంచి బయటకురావాల్సి వస్తుందేమోనని భయపడుతుంటారు. అందుకే ఎప్పుడో ఒకసారి కొత్తదనం చూపించాలని అనుకుంటారు.