ఒకవేళ తమలో పునరుత్పత్తి సామర్థ్యం లేదని తేలితే నలుగురు నవ్వుతారేమో అని, అత్తింట్లో మర్యాద పోతుందేమోనని, సూటిపోటి మాటలు పడాల్సి వస్తుందేమోనని వణికిపోతుంటారు. అయితే సంతానప్రాప్తి కలగాలంటే ఆడవారిలాగే పురుషులు కూడా సమాన బాధ్యత వహిస్తారు. అంటే.. ఆడవారితో పాటు మగాళ్లు కూడా ఈ సమస్యతో బాధపడతారు. అయితే, కొన్ని రకాల ఆహారాలు సంతాన సాఫల్యతను పెంచుతాయ్.
మనం తినే ఆహారం మొత్తం ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది. సంతానోత్పత్తిని పెంచడానికి కూడా పోషకాహారం కీలక పాత్ర పోషించింది. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ అధికంగా ఉండే ఆహారాలు తినడం ద్వారా సంతానలేమి సమస్యలు తొలగిపోతాయి.వీటితో పాటు సరైన జీవన విధానం, మంచి ఆహారం, సరిపడా నిద్ర... వంటివి సంతాన సమస్యలను దూరం చేస్తాయి.