దగ్గు, జలుబు లేకుండా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీలవుతాం. అదే గొంతులో తేడాగా ఉన్నా... ముక్కులో గడబిడ ఉన్నా... క్రమంగా మనం నీరసించిపోతాం. ఎందుకంటే ఈ దగ్గు, జలుబు అనేవి... మన బాడీలో చాలా రుగ్మతలకు అవకాశం కల్పిస్తాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇలా వన్ బై వన్ అన్నీ వచ్చేలా చేస్తాయి. కాబట్టి... దగ్గు, జలుబు రాగానే మనం అలర్ట్ అవ్వాలి. తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. వేడి చేసే ఆహారం, స్పైసీ ఫుడ్ తగ్గించెయ్యాలి.
2. పుక్కిలింతల చిట్కా : నీటిని నోటిలో పోసుకొని... ఓ రెండు నిమిషాలు పుక్కిలించి... బయట పారేయాలి. ఇలా ఒకట్రెండుసార్లు చేస్తే... గొంతులో రిలీఫ్ లభిస్తుంది. ఇలా రోజుకు రెండుసార్లైనా చెయ్యాలి. గోరువెచ్చటి నీటిలో... ఉప్పు లేదా పసుపు వేసుకొని... పుక్కిలిస్తే... గొంతులో మంట, గరగర వంటివి తాత్కాలికంగా తగ్గుతాయి.
3. విశ్రాంతి అవసరం : దగ్గు, జలుబు వంటివి ఉన్నప్పుడు... ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అవి తిరిగి రావాలంటే... కాస్త విశ్రాంతి తీసుకోవాలి. అలా రెస్ట్ తీసుకోవడం వల్ల... మనలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఒక్కసారి అది పెరిగిందంటే... ఇక వ్యాధిని తెచ్చే క్రిముల పని అయిపోయినట్లే. దగ్గు, జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు... ఆఫీస్‌కి వెళ్లి పనులు చేయడం కంటే... ఆ రోజు విశ్రాంతి తీసుకుంటే... ఒక్క రోజుతోనే అనారోగ్యం పరారవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
5. మిరియాలు, తేనె : ఒక టీస్పూన్ పసుపు, నల్లమిరియాలు, (Black pepper) తేనె (Honey) కలిపిన మిశ్రమం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రోజుకు కనీసం రెండు నుంచి మూడు సార్లు తులసి టీ తాగాలి. ఉసిరి, పైనాపిల్, నిమ్మ, కివీ మొదలైన పుల్లటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచింది. ఒక లీటరు నీటిలో ఏడు ఎనిమిది తులసి ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక టీస్పూన్ చొప్పున వాము, మెంతులు, పసుపు, నాలుగైదు నల్ల మిరియాలు వేసి మరిగించండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ మిశ్రమాన్ని తాగండి.