ఒక వ్యక్తిపై ఏర్పడే తెలియని మోహం, ఇష్టం, ప్రేమలను క్రష్ లేదా టెంపరరీ ఇన్ఫ్యాచుయేషన్ అంటారు. క్రష్ అనేది ఆడవాళ్లకు మగవాళ్లపైన లేదా మగవాళ్లకు ఆడవాళ్ల మీద కలిగే తాత్కాలికమైన, బలమైన భావన. క్రష్‌గా ఊహించుకునే వ్యక్తి కలల్లో కనిపించడం సాధారణ విషయం. వారితో సన్నిహితంగా ఉన్నట్లు, ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్టు, యాత్రలకు వెళ్లినట్లు కలలు వస్తుంటాయి. వీటివల్ల కొంతసేపు ఉత్తేజం కలుగుతుంది.
క్రష్ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు కల వస్తే... : ఇలాంటి కలలు వ్యక్తుల రొమాంటిక్ ఫీలింగ్స్‌ను ప్రతిబింబిస్తాయి. క్రష్ మీకు ప్రపోజ్ చేసినట్లు లేదా వారు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు కల వస్తే.. దీన్ని సానుకూల అంశంగా భావించాలి. ఈ కలలు వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. క్రష్‌పై మీకు నమ్మకం బలపడిందని దీని అర్థం. వీరు క్రష్ ఫీలింగ్‌ను ముందుకు తీసుకెళ్లడం మంచిది. వారికి ప్రపోజ్ చేయాలని ఇలాంటి కలలు ఉసిగొల్పుతాయి.
క్రష్ రిజెక్ట్ చేసినట్లు కల వస్తే? : ప్రస్తుతం చేస్తున్న పని లేదా ఉద్యోగం నుంచి మిమ్మల్ని బయటకు పంపిస్తే ఇలాంటి కలలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించేవారు, అభద్రత భావనలు ఎక్కువగా ఉన్నవారికి ఇలాంటి కలలు రావచ్చు. రిజెక్షన్ అనేది వీరి మనసులో ఉంటుంది కాబట్టి క్రష్ కూడా రిజెక్ట్ చేసినట్లు కలలు వస్తుంటాయి.
నచ్చని వ్యక్తులు కలలో కనిపిస్తే? : మనకు నచ్చని వ్యక్తి, లేదా మనం ద్వేషం పెంచుకున్న వ్యక్తుల గురించి కలలు కనడం సాధారణ విషయం. అంతమాత్రాన వారిపై ఫీలింగ్స్ ఉన్నాయనేది ఈ కలల అర్థం కాదు. మీ సబ్ కాన్షియస్ మైండ్ వారిని ఇంకా ఆరాధిస్తుందని భావించాలి. మనకు నచ్చని వ్యక్తుల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండవచ్చు. అదే వారికి గుర్తింపును తీసుకురావచ్చు. ఆ ప్రత్యేక లక్షణం కారణంగానే వారు కలలో కనిపిస్తారు.
పాత క్రష్ కూడా కలలో కనిపిస్తుందా? : గతంలో రిలేషన్షిప్లో ఉండి విడిపోయిన వ్యక్తి ఇటీవల కనిపించినా, వారితో ఎదురైన సంఘటనలు మళ్లీ కళ్లముందు జరిగినా పాత క్రష్ గురించి కలలు రావచ్చు. గతాన్ని గర్తుచేసుకున్నప్పుడు వ్యక్తుల సబ్ కాన్షియస్ మైండ్ పాత సంఘటనల నుంచి కొన్ని అంశాలను, ఓల్డ్ క్రష్‌తో కలగా మారుస్తుంది. ఏదైనా సంఘటన కారణంగా గతంలో క్రష్‌తో ఉండే అనుభవాలు గుర్తొస్తే.. సబ్కాన్షియస్ మైండ్ ఈ అంశాలను క్రష్‌కు అన్వయించి కలగా వచ్చేలా చేస్తుంది.
క్రష్ చనిపోయినట్లు కూడా.. : చావు కలలను ఒక సంఘటన ముగింపునకు లేదా జీవితంలో కొత్త మార్పులకు సంకేతంగా భావిస్తారు. క్రష్‌ను వదిలేసి జీవితంలో ముందుకు సాగాలనే అంశంపై ఆలోచించాలని మనసు మీకు సూచిస్తుందని ఈ కలల అర్థం. క్రష్ మీద ఫీలింగ్స్ తగ్గుతున్న సమయంలో ఇలాంటి కలలు వస్తే.. ఆ వ్యక్తి మీకు సరైన జోడీ కాదని భావించాలి.