1. స్నేహంతోనే రిలేషన్షిప్ ప్రారంభమవుతుంది
సాధారణంగా ఎలాంటి రిలేషన్షిప్స్ అయినా ఫ్రెండ్షిప్తోనే మొదలవుతాయి. డెమిసెక్సువల్గా ఉన్న వ్యక్తి ఎదుటివారి నుంచి నమ్మకాన్ని, భద్రతను ఆశిస్తారు. వారిలో ఈ లక్షణాలు కనిపిస్తేనే.. సెక్సువల్ రిలేషన్ కోరుకుంటారు. మొదటిసారి చూసినప్పుడు వారిపై కలిగిన అభిప్రాయం ఆ తరువాత మారుతుంది. అనంతరం ఆకర్షణ పెరుగుతుంది. వారితో మరింత సౌకర్యవంతంగా ఉంటారు. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయం తెలుసుకున్న తరువాతే వారి వైపు ఆకర్షితులవుతారు.
2. క్రష్.. ఫీలింగ్ కాదు
సాధారణంగా ఒక వ్యక్తికి ఎవరో ఒకరిమీదే బలమైన ఆకర్షణ కలిగిందంటే.. అది ఒక గొప్ప విషయంగా భావించాలి. యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఎదిగే క్రమంలో ప్రతిఒక్కరికీ ఎవరో ఒకరిపై ‘క్రష్’ ఫీలింగ్ ఏర్పడుతుంది. కానీ మీరు చిన్న వయస్సులో ఉన్నప్పుడు కలిగే క్రష్ ఫీలింగ్ కంటే డెమీసెక్సువల్లో ఎక్కువ లోతు ఉన్నట్లు మీకు అర్థమవుతుంది.
3. స్నేహంతో గందరగోళం
చాలావరకు క్రష్‌లు స్నేహంతో పాటే పుడతాయి. ఇలాంటి సందర్భాల్లో ఎదుటివారిపై మీకు కలిగే క్రష్ తీవ్రత అంతగా ఉండదు. కానీ వారితో భావోధ్వేగాలు పంచుకుంటున్న కొద్దీ ఒకరికి ఒకరు దగ్గరవుతారు. అప్పుడు ఎదుటివారిపై కలిగే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో స్నేహం, డెమిసెక్సువల్ ఫీలింగ్స్ కన్ఫ్యూజన్ అవుతాయి. ఇలాంటి ఫీలింగ్స్ ఎదుటివారిలో లేనప్పుడు ఫ్రెండ్షిప్ కూడా ఎండ్ అవుతుంది.
4. ఆ ఆకర్షణ వేరు
మొదటిసారి ఒకరిని చూసినప్పుడు కలిగే ప్రాథమికంగా సెక్సువల్ ఎట్రాక్షన్ కలగడం సాధారణ విషయం. డెమీసెక్సువల్ ఫీలింగ్స్‌కు సెకండరీ సెక్సువల్ ఎట్రాక్షన్తోనే సంబంధం ఉంటుంది. ఎదుటి వారి వ్యక్తిత్వం తెలుసుకొని, వారితో కనెక్ట్ అయిన తరువాతే రిలేషన్షిప్ మొదలవుతుంది. తెలియని వ్యక్తులు, పెద్దగా పరిచయం లేని వారిపై కలిగే ఆకర్షణ మామూలు విషయం. ఆ ఫీలింగ్ తాత్కాలికంగానే ఉంటుంది.
5. అవన్నీ పట్టించుకోవద్దు
పెంపకం, సంప్రదాయాలు వంటి కారణాల వల్ల కొంతమంది సెక్స్, లైంగిక ఆకర్షణకు దూరంగా ఉంటారు. కొంతమందికి ఇలాంటి వాటిపై ఆసక్తి ఉండదు. అలాంటి వారు వెల్లడించే అభిప్రాయాలను పట్టించుకోకూడదు. ఒక వ్యక్తి లైంగిక ఆలోచనలకు దూరంగా ఉండాలనుకోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అవి అందరికీ వర్తిస్తాయని భావించకూడదు. ఈ విషయంలో ఎదుటివారు వ్యతిరేకించినా సరే.. మనసుపెట్టి ఆలోచిస్తే మీ ఆలోచనలు, అభిప్రాయాలు సరైనవో కావో మీకే తెలుస్తుంది.