1. చలి వణికిస్తోంది. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా చలి తీవ్రంగా ఉంది. ఎండాకాలం ఎయిర్ కూలర్లు (Air Coolers), ఏసీలు వాడినట్టు, చలికాలంలో రూమ్ హీటర్ల (Room Heaters) వాడకం పెరిగిపోయింది. మధ్యతరగతి కుటుంబాల్లో కూడా రూమ్ హీటర్లు వాడుతున్నారు. అయితే రూమ్ హీటర్లు వాడే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే రిస్క్. (ప్రతీకాత్మక చిత్రం)
2. రూమ్ హీటర్ల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. అందుకే రూమ్ హీటర్ కొనాలని నిర్ణయించుకోవడం కన్నా ముందే దాని వల్ల ఉండే రిస్కుల్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యం పాడవడం నుంచి ప్రాణాలు పోవడం వరకు అనేక చిక్కులు ఉంటాయి. మరి రూమ్ హీటర్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. రూమ్ హీటర్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. మొదటి ఫ్యాన్ హీటర్. రెండోది రేడియంట్ హీటర్. ఫ్యాన్ హీటర్ ధర తక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలో గది వేడెక్కుతుంది. రేడియంట్ హీటర్ ధర కూడా తక్కువ. ఇది ఉపయోగించినా తక్కువ టైమ్‌లో రూమ్ వేడెక్కుతుంది. అయితే ఈ రెండు హీటర్లతో రిస్క్ ఉంటుంది. వీటిని కాసేపు ఆన్ చేసి గది వేడెక్కిన తర్వాత ఆఫ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. రాత్రంతా ఆన్ చేసి అలాగే ఉంచేస్తే మీరు ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే. గాలిలో తేమ ఆవిరవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీని వల్ల మీకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఈ పరిస్థితి మీ ప్రాణాలకు కూడా రిస్క్ తీసుకురావొచ్చు. అందుకే ఫ్యాన్ హీటర్, రేడియంట్ హీటర్ వాడితే కాసేపు మాత్రమే ఉపయోగించాలి. ఎట్టిపరిస్తితుల్లో రూమ్ హీటర్ ఆన్ చేసి నిద్రపోకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. మూడోది ఆయిల్ ఫిల్డ్ రూమ్ హీటర్. ఈ మూడు రకాల రూమ్ హీటర్లకు డిమాండ్ ఎక్కువ. అయితే అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. ఇక ఆయిల్ ఫిల్డ్ రూమ్ హీటర్‌తో అంత ప్రమాదం ఉండదు. కానీ ఖరీదు ఎక్కువ. ఇందులోని చిన్న పైప్స్ ద్వారా ఆయిల్ సరఫరా అవుతూ వేడెక్కుతుంది. ఆ వేడి కారణంగా గది వేడెక్కుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. రూమ్ హీటర్లు అతిగా వాడితే చర్మ సమస్యలు, కంటి సమస్యలు కూడా వస్తాయి. దురద పెట్టడం, చర్మం ఎరుపెక్కడం, అలెర్జీ లాంటి సమస్యలు రావొచ్చు. గుండె సమస్యలు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్న పిల్లలు రూమ్ హీటర్ ఉపయోగించకపోవడమే మంచిది. రూమ్ హీటర్‌కు దగ్గరగా పేపర్లు, ఫర్నీచర్, బ్లాంకెట్స్ లాంటి సులభంగా మండే పదార్థాలను, వస్తువుల్ని ఉంచకూడదు. పిల్లల్ని, పెంపుడు జంతువుల్ని రూమ్ హీటర్ల దగ్గరకు రాకుండా చూడాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని రూమ్ హీటర్ తీసుకోవాలి. ఇబ్బందులు రాకుండా మెయింటైన్ చేయాలి. ఈ రిస్కులు ఎందుకు అనుకుంటే చలిని తట్టుకోవడానికి ఇతర మార్గాలేవైనా ఫాలో కావాలి. ఇంట్లో చలి తక్కువగా ఉండే గదిలో నిద్రపోవచ్చు. చలి తట్టుకోవడానికి కంఫర్టర్, రగ్గులు, బ్లాంకెట్స్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)