Ants in House: ఈ భూమిపై అత్యంత కష్టజీవులు ఏవంటే... చీమలు, తేనెటీగలే. కానీ మన చర్యల వల్ల అవి చనిపోతున్నాయి. ఫలితంగా పర్యావరణం దెబ్బతింటోంది. అలాగని చీమల్ని ఇంట్లోకి రానివ్వలేం. అవి ఇంట్లోకి వస్తే... గడపలు, గోడలు ఇలా ప్రతి దాన్లోనూ కన్నాలు పెట్టి... పెద్ద పెద్ద కాలనీలు నిర్మించుకుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే... ఇంటి పునాది దెబ్బ తింటుంది. ఫలితంగా వర్షాకాలంలో ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. తాజ్మహల్ లాంటి పెద్ద కట్టడానికి కూడా చీమలు పునాదిలో కన్నాలు పెట్టేశాయి. కాబట్టి... చీమలు ఇంట్లో కనిపిస్తే... వాటిని త్వరగా బయటకు పంపేసే పని ప్రారంభించుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇళ్లలో మనం వదిలేసే ఆహారం... కింద పడే గింజలు ఇతరత్రా వాటి నుంచి వచ్చే వాసనను చీమలు పసిగడతాయి. సపోజ్ టీ పెడుతూ... పంచదార వేస్తున్నప్పుడు కొద్దిగా కింద పడితే... ఆ వాసన చీమలకు చేరుతుంది. దాంతో... పంచదార పలుకులు పట్టుకెళ్దామని వస్తాయి. అలా వచ్చిన చీమల్ని చంపడం మంచిది కాదు. ఎందుకంటే... అవి మన పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. ఈ భూమిపై చీమలే లేకపోతే... చాలా రకాల చెట్లు పెరగవు. వాటి వేర్లు నేలలోకి బాగా వెళ్లేలా చీమలు చేస్తాయి. కాబట్టి... చీమల్ని చంపకుండానే బయటకు పంపేసే టిప్స్ మనం పాటించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
Baking Soda: ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే... చీమల మందు వాడటం ప్రమాదకరం. ఎందుకంటే... ఆ స్మెల్తో పిల్లలు వాంతులు చేసుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చీమలు వచ్చే చోట... తినే సోడా (Baking Soda)ను చల్లవచ్చు. ఇంట్లో మిగిలిన చెట్టను పారేసే డస్ట్ బిన్ చుట్టూ కూడా బేకింగ్ సోడా చల్లితే చీమలు రావు. (ప్రతీకాత్మక చిత్రం)
Cinnamon: దాల్చిన చెక్క వాసన మనకు నచ్చుతుంది... చీమలకు అస్సలు నచ్చదు. కాబట్టి దాల్చిన చెక్క పొడిని... చీమలు వచ్చే కన్నాల దగ్గర వేస్తే... ఇక అవి... వేరే దారి చూసుకుంటాయి. లేదంటే... దాల్చిన చెక్క ఆయిల్ బాటిల్ కొని... నీటిలో... కొన్ని చుక్కలు కలిపి... చీమలు వచ్చే చోట... ఆ నీటిని చల్లినా చాలు... చీమలు ఇక రావు. అలాగే... కిటికీలు, తలుపుల మూలల్లో దాల్చిన చెక్కను ఉంచితే... చీమలు, ఇతర పురుగులు రావు. (ప్రతీకాత్మక చిత్రం)
Vinegar: వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది. చీమల్ని తరిమేసేందుకు ఇది సరైనదిగా భావిస్తారు. నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి... ఆ నీటిని చీమల పుట్టలు, కాలనీలపై స్ప్రే చెయ్యాలి. అంతే... చీమలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఇక మళ్లీ అక్కడికి రావు. కిటికీలు, తలుపులపైనా స్ప్రే చేస్తే మంచిదే. మీరు స్ప్రే చేసిన తర్వాత కూడా చీమలు ఉంటే... మరింత స్ప్రే చెయ్యాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Borax: బొరాక్స్ను సోడియం టెట్రాబొరేట్ (sodium tetraborate) అని కూడా అంటారు. దీన్ని క్లీనింగ్ చెయ్యడానికీ, పురుగుల్ని తరిమెయ్యడానికీ వాడుతారు. ఇది మీకు మందుల షాపుల్లో, కొన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. దాన్ని తెచ్చి... గోరు వెచ్చట నీటిలో... 2 టేబుల్ స్పూన్లు కలిపి... కొద్దిగా పంచదార కూడా వేసి... మిక్స్ చేసి... పురుగులు, చీమలు ఉన్న చోట చల్లితే... బాబోయ్... ఏంటిది... దేవుడా అంటూ అవి వెళ్లిపోతాయి. మీరు... బొరాక్స్ కలిపిన నీటిలో... దూది ముద్దల్ని ముంచి... కిటికీలు, తలుపుల దగ్గర, చీమలు వచ్చే ఏరియాల్లో ఉంచితే... ఇక అవి అటు రావు. ఇక్కడో చిన్న సమస్య ఉంది. బొరాక్స్ వల్ల చీమలు చచ్చిపోతాయి. కాబట్టి... పై టిప్స్ వల్ల చీమలు తగ్గకపోతే... అప్పుడు మాత్రమే బొరాక్స్ వాడటం మేలు. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)