నిత్య యవ్వనంగా కనిపించాలని ప్రతి మగువ కోరుకుంటుంది. అయితే చర్మాన్ని (Skin) ఎల్లప్పుడూ కాపాడుకోవడం కోసం స్కిన్‌కేర్ టిప్స్ (Skin Care Tips) తప్పక పాటించాలి. ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల తక్కువ వయసులోనే కొందరిలో వృద్ధాప్య ఛాయలను కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఇంకా రకరకాల చర్మ సమస్యలు కూడా వారిని వేధిస్తుంటాయి. (Image Credit : Shutterstock)
చర్మ సౌందర్యానికి వయసుతో సంబంధమే లేదు. సరైన స్కిన్‌కేర్ టిప్స్ పాటిస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. మీరెప్పుడు స్కిన్ పట్ల కేర్ తీసుకోవడం ప్రారంభించినా.. మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొరియన్స్ ప్రకారం, చర్మ సంరక్షణలో భాగంగా.. హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని సన్‌స్క్రీన్‌తో కాపాడుకోవాలి. సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్ సమస్యలు దరిచేరవు. కాలుష్యం బారి నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
* ఫేషియల్ ఎక్సర్సైజ్లు : ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం ముఖ వ్యాయామాలు (Facial exercises) చేయాలి. యవ్వనంగా కనిపించే చర్మం కోసం ఫేషియల్ మసాజ్‌లు తప్పనిసరి అని కొరియన్ బ్యూటీ టిప్స్ చెబుతున్నాయి. నోటితో పుక్కిలించడం, బుగ్గలను పక్కకు కదపడం, నవ్వడం, చిన్ లిఫ్ట్ చేయడం వంటి రకరకాల ఫేషియల్ ఎక్సర్సైజ్లు మెరిసే చర్మం పొందడంలో సహాయపడతాయి.
* మేకప్‌కి ముందు క్లీనింగ్ : ముఖచర్మంపై ఎక్స్ట్రా ఆయిల్, ధూళి, బ్యాక్టీరియా పేరుకుపోవడం సహజం. అయితే శుభ్రమైన నీటితో వీటిని తొలగించుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా మేకప్‌కి ముందు ముఖం బాగా శుభ్రం చేసుకోవాలి. ముందస్తు వృద్ధాప్యం, డార్క్ స్పాట్స్, బ్రేక్అవుట్లకు ముఖం కడుక్కోకపోవడమే ప్రధాన కారణం అవుతుంది. కొరియన్ స్కిన్‌కేర్ టిప్ ప్రకారం.. ముఖం శుభ్రంగా కడుక్కొని సున్నితమైన టవల్‌తో మొండి మలినాలను తొలగించుకోవాలి.
అలానే చెమట ద్వారా చర్మంలోని మలినాలు బయటికి పోతాయి. అప్పుడు ఆరోగ్యకరమైన స్కిన్ మీ సొంతమవుతుంది. అలానే నైట్ క్రీమ్‌లు, స్లీపింగ్ మాస్క్‌లు, ఐ మాస్క్‌లు, జేడ్ రోలర్లు, లిప్ కేర్ కిట్లు, ఆయిల్ బేస్డ్ సీరమ్‌లు, మాయిశ్చరైజర్లు, టోనింగ్ ఎసెన్స్, నైట్ ప్యాక్‌లు, విటమిన్ సి, ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు వాడాలి.