మన దేశంలో సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువ ఉంటుందో.. శృంగారానికీ అంతే విలువ. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ ఆ పని చేస్తామంటే పెద్దోళ్లు మొట్టికాయలు వేస్తారు.
రెండు, మూడు శతాబ్ధాలను పరిశీలిస్తే మనదేశంలో శృంగారం అనేది రహస్య కార్యక్రమం. దాని గురించి మాట్లాడాలన్నా, చేయాలన్నా భయంతో జంకేవారు.
కానీ.. ఇప్పుడు స్మార్ట్ యుగం పుణ్యమా అని అంతా ఓపెన్ అయిపోయింది. అలాగే.. రెండో శతాబ్ధం నాడు కూడా శృంగారం గురించి ఓపెన్‌గానే మాట్లాడుకునేవారట. అందుకు సాక్ష్యమే వాత్సాయనుడు రాసిన కామసూత్ర అని విశ్లేషకులు చెబుతున్నారు. (రొనాల్డో, రోడ్రిగ్జ్)
అయితే, ఆ సమయంలో శృంగారంపై పూర్తి క్రమశిక్షణతో మెలిగేవారని, ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకునేవారని వివరిస్తున్నారు. శృంగారం అనేది శారీరక ఆనందమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా అని గట్టిగా భావించేవారట.
అందుకే.. చెడు సమయాల్లో, చెడు స్థలాల్లో శృంగారం చేసేవారు కాదట. ఆరోగ్యంగా ఉండేందుకు శృంగారం చేసే ముందు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకొనేవారట.
ముఖ్యంగా ఐదు విషయాలను దృష్టిలో పెట్టుకొని శృంగార కార్యకలాపాల్లో పాల్గొనేవారని నిపుణులు వెల్లడించారు. ఆ ఐదు విషయాలు ఏంటంటే..
1. మహిళలకు పీరియడ్స్ వస్తే తొలి నాలుగు రోజుల పాటు శృంగారంలో పాల్గొనేవారు కాదు. ఒకవేళ పాల్గొంటే ఆమెకు రోగాలు వస్తాయని నమ్మేవారు. పీరియడ్స్ వచ్చిన రోజు నుంచి 5వ, 12వ, 16వ రోజుల్లో సెక్స్‌లో పాల్గొనేవారు.
2. డే టైంలో స్త్రీ, పురుషులు సెక్స్ చేసుకునేవాళ్లు కాదు. దేవుడి పూజ చేసే ఉదయం, సాయంత్ర సమయాల్లో అస్సలు బెడ్‌పై ఉండేవారు కాదు. గ్రహణం, సూర్యోదయం, సూర్యాస్తమం, చనిపోయినా, శ్రావణ మాసం, అమావాస్యల్లో సెక్స్ జోలికే పోయేవారు కాదు. అది ధర్మానికి విరుద్ధం అని భావించేవారు.
3. భార్య తప్ప వేరే స్త్రీతో శృంగారం చేసేవారు కాదు. అది అధర్మం అని అనేవారు. అక్రమ సంబంధాలు జీవితాన్ని నాశనం చేస్తాయని గట్టిగా నమ్మేవారు.
4. గర్భవతి అయిన మహిళలు శృంగారానికి దూరంగా ఉండేవారు. ఒకవేళ శృంగారం చేస్తే పిల్లలు అవిటి వాళ్లలా పుడతారని భయపడేవారు.