Masala Fish Curry తయారీకి కావాల్సినవి: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీస్పూన్, చేపలు అరకేజీ, మీడియం సైజు ఉల్లిపాయ... సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకులు కొన్ని, పసుపు 1 టీస్పూన్, మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజులో చింతపండు, సరిపడా ఉప్పు, సరిపడా నీరు, గరం మసాలా పౌడర్ 1 టీస్పూన్.... వీటితోపాటూ... మసాలా తయారీకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 8-10 వరకూ ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి, అరకప్పు తాజా కొబ్బరి (తరిగిపెట్టుకోవాలి)
Masala Fish Curry తయారీ విధానం: చింతపండును 10 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిలోంచి చింతపండును తీసి... బాగా పిసికి... ఆ గుజ్జురసాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత... ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి... వేడి చెయ్యాలి. ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి. ఎండుమిర్చి, ధనియాలు వెయ్యాలి. బంగారం రంగులోకి వచ్చే వరకూ వేపాలి. ఇప్పుడు వాటిని మిక్సీలో వేసి... గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుజ్జులో కొబ్బరి కలిపి... పక్కన పెట్టుకోవాలి. మరీ గట్టిగా ఉంటే... కొద్దిగా నీరు పోసుకోవచ్చు.
ఇప్పుడు ఇంతకుముందు వాడిన ప్యాన్‌లోనే... ఆల్రెడీ ఉన్న నూనెను వేడి చేసి... ఆవాలు వెయ్యాలి. అవి పేలుతున్నట్లు సౌండ్ చేస్తాయి కదా... సరిగ్గా అప్పుడే గురిచూసి... ఉల్లిపాయ ముక్కలూ, కరివేపాకూ వేసేయాలి. నూనె చాలదనుకుంటే వేసుకోవచ్చు. అప్పుడే పసుపు కూడా వేసేయండి. అన్నీ బంగారు వర్మంలోకి వచ్చి... బ్రౌన్ కలర్లోకి మారే వరకూ అలా అలా కదుపుతూ ఉండండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేయండి. అవి మెత్తగా అయ్యేవరకూ నూనెలోనే వేపండి. ఇప్పుడు ఇంతకు ముందు మనం చేసిన మసాలాను వేసేయండి. వెంటనే నీరు, చింతపండు రసం కూడా వేసేయండి. సరిపడా ఉప్పు కూడా వేసేయండి. అన్నీ బాగా కలిపి మూత పెట్టండి. మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి.
కాసేపటికి మూత తీసి చూస్తే... నూనె పైకి తేలుతున్నట్లుగా ఉంటుంది. అదీ అప్పుడు మీరు... చేప ముక్కల్ని వేసి... వాటికి కర్రీ అంటుకునేలా అటూ ఇటూ కాస్త మెల్లగా కదిపి... మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించండి. అంతే కర్రీ రెడీ... చివర్లో గరం మసాలా పౌడి చల్లి... వేడివేడిగా వడ్డిస్తే... తిన్నవారు... భోజనం అయిపోగానే ఇంట్లోంచీ బయల్దేరతారు. ఎక్కడికి అంటే... మరో అరకేజీ చేపలు తెస్తానని చెబుతారు... అదీ అలా ఉంటుంది ఈ కర్రీ.