Health benefits of Peaches : మకరంద పండ్లు... ఎక్కువగా వాయవ్య చైనాలో పండుతుంటాయి. ఇవి స్టోన్ ఫ్రూట్ జాతికి చెందినవి. అంటే... వీటి మధ్యలో ఒకటే గింజ ఉంటుంది. చెర్రీస్, ఆప్రికాట్స్, ప్లమ్స్, నెక్టారిన్స్ ఇలాంటివే. పీచ్ పండ్లలోపలి పదార్థం తెలుపు, పసుపు, ఆరెంజ్ కలర్స్‌లో ఉంటుంది. మకరంద పండ్లలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఫ్రీస్టోన్, క్లింగ్స్టోన్.
Heart health : మకరంద పండ్లలో ఉండే... ఫైబర్, పొటాషియం, విటమిన్ సీ, ఖోలైన్ పదార్థాలు... గుండెకు మేలు చేస్తాయి. గుండె జబ్బులు వచ్చేవారికి పొటాషియం పెరగాలి, సోడియం తగ్గాలి. ఇందుకు పీచ్ పండ్లు ఉపయోగపడతాయి. రోజుకు 4069 మిల్లీ గ్రాముల పొటాషియం పొందేవారికి... గుండె వ్యాధుల వల్ల చనిపోయే అవకాశం 49 శాతం తగ్గుతుంది.