రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది : ఈ చిన్న రేగు పండ్లు... పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి. ఈ మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. ఎనీమియాగా పిలిచే రక్త హీనత సమస్య నుంచీ మనల్ని కాపాడతాయి రేగు పండ్లు. రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే రేగు పండ్లు మన శరీరానికి అవసరం.
చర్మం మెరిసేలా చేస్తాయి : జుజుబీల్లో సీ విటమిన్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన వయసు పెరుగుదలను తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెండ్స్ మన చర్మ కణాల్లో ఫ్రీ రాడికల్స్ (వ్యర్థాలు)తో పోరాడతాయి. కణాలు పాడవ్వకుండా చేస్తాయి. అలాగే... విటమిన్ సీ... మన ముఖాన్ని కాపాడుతుంది. మచ్చల్ని పోగొట్టి, చర్మం మెరిసేలా చేస్తాయి. త్వరగా ముసలితనం రాకుండా కాపాడతాయి. డల్ స్కిన్ను క్లియర్ చేసి... ఎంతో మేలు చేస్తాయి రేగుపండ్లు.
ఎముకలకు ఎంతో మేలు : ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. మన ఎముకలు దృఢంగా, గట్టిగా ఉండేందుకు అవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినిపించడం సరైన పరిష్కారం. కీళ్ల వాపులు, నొప్పులూ ఉన్నవారు సైతం... ఈ పండ్లు తింటే మంచిది వీటిలోని యాంటీ-ఇన్ఫామేటరీ గుణాలు... కీళ్ల మంటల్ని చల్లబరుస్తాయి.
మెటబాలిజంను మెరుగు పరుస్తాయి : మన శరీరానికి ఏవి ఎంత కావాలో డిసైడ్ చెయ్యడంలో రేగు పండ్లు ఉపయోగపడతాయి. తేలిగ్గా జీర్ణమయ్యే ఈ పండ్లు... ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలతో... మన శరీరం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలోని పీచు పదార్థం... మలబద్ధకాన్ని పోగొడుతుంది. పొట్టలో గ్యాస్ వంటి సమస్యలు ఉంటే... రేగు పండ్లు తినడం మంచిది.
మంచి నిద్రను ఇచ్చే పండ్లు : కొంతమందికి ఎంత ట్రైచేసినా నిద్రపట్టదు. చివరకు నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సరైన పండ్రు రేగు పండ్లు. ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెండ్స్, ఫైటోకెమికల్స్, పోలీశాచరైడ్స్, ఫ్లేవనాయిడ్స్, సాపోనిన్స్ వంటివి ఉన్నాయి. ఇవి నిద్రబాగా వచ్చేలా చేస్తాయి. నరాలను శాంతపరచడం ద్వారా ఇవి మనం నిద్రపోయేలా చేయగలవు. టెన్షన్, ఒత్తిడి వంటివి తగ్గాలంటే కూడా రేగుపండ్లు తినాలి.