యాపిల్ త్వరగా ముసలితనం రాకుండా కాపాడుతుంది. ఇందులోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ మన చర్మ కణాల్ని కాపాడతాయి. ముడతలు, మచ్చల వంటివి రాకుండా చేస్తాయి. చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారేలా యాపిల్ చేస్తుంది. మృత కణాల్ని తొలగించడమే కాదు. పాడైన కణాల్ని సరిచేస్తుంది కూడా. ఈ గుజ్జులో తేనెను కలిపి చర్మానికి పట్టిస్తే, యవ్వన ఛాయలతో మెరిసే స్కిన్ పొందొచ్చు
యాపిల్‌లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. అందువల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగయ్యి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాపిల్ మంచి డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్ కూడా. ఇది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన కాలేయంలోని విషాల్ని విజయవంతంగా తొలగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదంటున్నారు పరిశోధకులు. ఇవి మనకు ఏడాదంతా దొరుకుతాయి కాబట్టి, ప్రణాళికా బద్ధంకా తింటూ ఉంటే, మనకు తెలియకుండానే చాలా రకాల రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.