ఇది ఆహారంలో బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనుమతిస్తుంది. దీంతో నిల్వ చేసిన ఆహారం మరుసటి రోజు లేదా త్వరగా పాడైపోయేలా చేస్తుంది. చాలా సార్లు తొందరపడి మనం వేడి ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్లో ప్యాక్ చేస్తాము, కానీ అది మన ఆరోగ్యానికి చాలా హానికరం. అల్యూమినియం ఫాయిల్లో ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల మెదడు కణాల సంఖ్య తగ్గుతుంది. అలాగే, అల్జీమర్స్, ఎముకల సంబంధ వ్యాధులు, మూత్రశాయ అనారోగ్యాలు వచ్చే ప్రమాదముంది.
అల్యూమినియం ఫాయిల్ లేదా ప్లాస్టిక్ లంచ్ బాక్సుల్లో ఆహారాన్ని ప్యాక్ చేసే బదులు గాజు పాత్రల్లో ప్యాక్ చేయడం మంచిది. దీంతో ఆహారంలోని పోషకాలు సురక్షితంగా ఉంటాయి. అల్యూమినియం ఫాయిల్స్కు బదులుగా పింగాణీ, సెరామిక్ వంటి వస్తువులలో ఆహారాన్ని పెట్టవచ్చని, వాటితో ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు సూచిస్తున్నారు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )