అతిగా తాగడం వల్ల ఎసోఫాగియల్ క్యాన్సర్, సిర్రోసిస్, ఇతర తీవ్రమైన అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మితమైన మద్యపానం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అసలు మద్యం ముట్టని టీటోటెల్లర్స్ కంటే.. పరిమితంగా బీరు, సాధారణ ఆల్కహాల్ శాతం ఉండే డ్రింక్స్ తీసుకునే వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని పరిశోధనల్లో కనుగొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇతర హార్డ్ డ్రింక్స్‌తో పోలిస్తే, బీర్లో ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. బీరులో నాలుగు నుంచి ఆరు శాతం ఆల్కహాల్ మాత్రమే ఉంటుంది. అయితే ఇది బ్రాండ్‌ని బట్టి మారుతుంది. దీంతోపాటు బీరులో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పెద్దగా ఉండదు. ఒక పింట్ బీర్లో సుమారు 208 క్యాలరీలు ఉంటయాని అంచనా.(ప్రతీకాత్మక చిత్రం)
అతిగా మద్యం తాగితే హ్యాంగోవర్ అవుతుంది. సాధారణంగా విస్కీ, బ్రాందీ వంటి హార్డ్ డ్రింక్‌తో ఎక్కువ మందికి హ్యాంగోవర్ అవుతుంది. వీటితో పోలిస్తే అదే మొత్తంలో బీర్ తాగడం వల్ల తక్కువ డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఫలితంగా హ్యాంగోవర్ వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయి. అలాగని అతిగా బీరు తాగినా ప్రమాదమే. (ప్రతీకాత్మక చిత్రం)