Actress Kriti Shetty : ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. సౌత్ ఇండియాలోని అందమైన హీరోయిన్లలో ప్రత్యేకమైనది. తొలి మూడు సినిమాలూ హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. ఈ అమ్మడికి స్టార్ డమ్ కలిసొచ్చింది. ఆ తర్వాత చెప్పుకోతగ్గ హిట్స్ లేకపోయినా.. వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. (image credit - instagram - krithi.shetty_official)
అందం తోనే కాకుండా.. నటనతోనూ ఆకట్టుకుంటున్న బేబమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్స్‌ని బయటపెట్టింది. అవి చాలా సింపుల్వే. ఎవరైనా ఇంటిదగ్గర ట్రై చెయ్యవచ్చు. ఐతే.. కృతీకి సహజంగానే అందం ఉంది. ఆమె స్కిన్ సహజ సిద్ధంగా మెరుస్తోంది. ఆమె ఏం చేస్తోందో తెలుసుకుందాం. (image credit - instagram - krithi.shetty_official)
తీసుకున్న పదార్థాలను ఓ గిన్నెలో మిక్స్ చెయ్యాలి. మరీ నీరులా కాకుండా.. మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దాన్ని ముఖానికి అప్లై చేసి.. అరగంట తర్వాత నీటితో లేదా సబ్బుతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. కొన్ని నెలల్లోనే తేడా కనిపిస్తుంది. (image credit - instagram - krithi.shetty_official)
మార్కెట్లో లభించే క్రీములతో కంటే.. ఇంట్లోని సహజ సిద్ధమైన వాటితోనే.. ఫేస్ ప్యాక్ వేసుకోమని కృతి శెట్టి సూచిస్తోంది. క్రీముల్లో ఉండే కెమికల్స్ అందరికీ సెట్ కాకపోవచ్చంటున్న ఈ బ్యూటీ.. ఇంట్లోని పదార్థాల వల్ల తనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ రావట్లేదని తెలిపింది. (image credit - instagram - krithi.shetty_official)
ఓ గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసి.. కొంత నీరు పోసి.. ఆ నీటిలో 20 నిమిషాల పాటూ ముఖాన్ని ఉంచాలని బేబమ్మ చెబుతోంది. అప్పుడప్పుడూ ముఖాన్ని బయటకు తీసి.. ఊపిరి పీల్చుకొని.. మళ్లీ గిన్నెలో పెట్టాలని చెబుతోంది. దీని వల్ల స్కిన్ కోమలంగా మారుతుందని తెలిపింది. (image credit - instagram - krithi.shetty_official)