ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌పై దృష్టి పెడుతున్నాయి. ఇంటి బయట, వరండాలో చెట్లు, మొక్కలు ఉండటమే కాదు... ఇంట్లోనూ, మూల మూలనా మొక్కలు పెంచాలన్నది గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్. మొక్కలకు మనం దగ్గరగా ఉండే కొద్దీ... మనలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతున్నట్లు పరిశోధనలో తేలింది. పట్టణీకరణ పెరగడంతో... మనం కిటికీ లోంచీ బయటకు చూస్తే... మొక్కలు, చెట్లు, పర్యావరణం కనిపించట్లేదు. వాటి బదులు భవనాలు, రోడ్లే కనిపిస్తున్నాయి. ఇవే ఉద్యోగులు, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ప్రకృతి నుంచీ వచ్చిన మనం... ప్రకృతితో ఉన్నంతసేపూ హాయిగానే ఉంటామని పరిశోధనలు చెబుతున్నాయి.