* ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి : పెళ్లి అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఆర్థికంగా బాగా స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకుందామనే ఆలోచనలో చాలామంది ఉంటున్నారు. అందుకే 30 నుంచి 33 ఏళ్లు పెళ్లి చేసుకోడానికి తగిన సమయంగా భావిస్తున్నారు. టైర్-3 నగరాల్లోని 41 శాతం మంది, టైర్-2 నగరాల్లో 28 శాతం మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ ట్రెండ్ రాబోయే రోజుల్లో సాధారణంగా మారొచ్చని సంబంధిత సైట్ నిర్వాహకులు చెబుతున్నారు.
* సాఫ్ట్వేర్కే ఓటు.. : 2022 సంవత్సరానికి వచ్చేసరికి మిగిలిన రంగాల వారితో పోలిస్తే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికే ఎక్కువ సంబంధాలు వస్తున్నాయి. టీచర్ వృత్తిల్లో ఉన్న వారితో పోలిస్తే 5.97 రెట్లు సాఫ్ట్వేర్ ఇంజినీర్లనే చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకింగ్, హెచ్.ఆర్, ఆడ్మినిస్ట్రేషన్, డాక్టర్స్, ఫైనాన్స్, అనలిస్ట్‌లు, కన్సల్టెంట్, అకౌంట్స్, మార్కెటింగ్, ప్రొఫెసర్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగంలో ఉన్నవారిని చేసుకోవడానికి చూస్తున్నారు.
వరుడు లేదా వధువు కమ్యూనిటీ, ప్రాంతం, జీతం తదితర 20 అంశాల్లో ఫిల్టర్ చేసి వెరిఫై చేసిన ప్రొఫెల్స్‌ను మాత్రమే తమ ఖాతాదారులకు అందిస్తున్నట్లు వివరించారు. లిస్ట్‌లో అనువైన మ్యాచ్ దొరికితే, వారితో కనెక్ట్ అయ్యేందుకు ఉచితంగా చాట్ చేసే ఫీచర్‌ను కూడా కొత్తగా తీసుకొచ్చినట్లు రోహన్ మాథుర్ తెలిపారు. వరుడు లేదా వధువుకు అన్నివిధాల సరిపోయే మంచి జోడి దొరికేందుకు, తమ క్లయింట్లకు అత్యుత్తమ సేవలు అందించేందుకు నిరంతర కృషి చేస్తామని ఆయన హామీ ఇస్తున్నారు.