చపాతీల్లో విటిమిన్ బి, ఈ, మినరల్స్, కాపర్, జింక్, అయోడిన్, పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. చపాతీలను రోజూ తినడం వల్ల ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండమే కాక చర్మం మెరుస్తుంటుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల చపాతీలను తినడం వల్ల రోజుకి సరిపడా శక్తి ఉంటుంది. చపాతీలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల డయాబెటిస్, బీపీ కంట్రోల్లో ఉంటాయి. అదేవిధంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ శాతం మెరుగుపడుతుంది. కేలరీస్ ఎక్కువగా ఉన్న చపాతీలను తినడంవల్ల ఎక్కువసమయం ఆకలిగా అనిపించదు. ఈ కారణంగా బాడీ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది.