మనల్ని మనం అంగీకరించడం: ముందుగా మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మనం ఎంత విలువైనవాళ్లమో తెలుసుకోవడమే అందుకు మార్గం. మన యోగ్యతలను మనం గుర్తించకపోతే, ఇతరులు వాటిని మెచ్చుకునే అవకాశం ఉండదు. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారనే దాని గురించి చింతించడం మానేయండి. మీ గురించి సానుకూలంగా మాట్లాడటం ప్రారంభించండి. నమ్మకాన్ని పెంపొందించడం ఒక్కరోజులో జరగదు. కానీ, క్రమంగా అలవాటు చేసుకోవాలి.
దయ: సమాజంతో విసుగు చెందడం సాధారణం. కానీ అన్ని విషయాలలో సందేహంతో ప్రయాణించడం ఫలించదు. కాబట్టి ఫీల్డ్ రియాలిటీని అర్థం చేసుకోండి, సహజంగా జీవించడం నేర్చుకోండి. చాలా సందర్భాల్లో మీరు దయగల స్వభావాన్ని ప్రదర్శిస్తే తప్పులను కూడా సరిదిద్దవచ్చు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)