సోయాబీన్స్: శాకాహారంలో సోయాబీన్స్.. ప్రోటీన్లకు మంచి వనరులు. వీటిలో మాంసాహారంతో సమానంగా ప్రోటీన్లు ఉంటాయి. వివిధ రకాల బి విటమిన్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు, అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు వంటి వాటికి సోయాబీన్స్ నిలయంగా ఉంటాయి. సోయా ప్రోటీన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను, రక్తపోటును తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. సోయాలో ఉండే ఐసోఫ్లావోన్స్ అనే సమ్మేళనం మహిళల్లో మెనోపాజ్ సమస్యలను నివారిస్తుంది. ధమనుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రొస్టేట్, రొమ్ము కాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)