ఫేస్ ప్యాక్ 1: 1. వేప, 2. తులసి ఆకులు, 3. తేనె 4. ముల్తానీ మిట్టి ..ప్యాక్ తయారీ: 6-7 వేప ఆకులను తీసుకోండి. దీనికి కొన్ని తులసి ఆకులను జోడించి, వాటిని గ్రైండ్ చేసి, 1 స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి అరకప్పు ముల్తానీ మట్టిని కలపండి. ఇప్పుడు పదార్థాలన్నీ బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి.ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మంలోని జిడ్డును తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
ఫేస్ ప్యాక్ 2 కావలసినవి: 1. ఓట్స్, 2. తేనె, 3. వేప, 4. పాలు,
తయారీ: ఒక గిన్నెలో అరకప్పు ఓట్స్ తీసుకోండి. 1 tsp పాలు, 1 tsp తేనె జోడించండి. తరువాత, వేప పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 3-4 నిమిషాల పాటు సర్క్యూలర్ మోషన్లో సున్నితంగా స్క్రబ్ చేయండి. తర్వాత 15 నిమిషాల పాటు ఆరనివ్వండి, ఆపై కడిగేయండి.