2023 Lucky Zodiac Signs : మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఆ తర్వాత భోగి, సంక్రాంతి సందడి ఉంటుంది. ఈసారి న్యూఇయర్ సహజంగానే ఎక్కువ రాశుల వారికి అనుకూలంగా ఉందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. గ్రహ సంచారం చక్కగా ఉంది అంటున్నారు. అందువల్ల చాలా రాశుల వారు కొత్త సంవత్సరంలో శుభవార్తలు వింటారని చెబుతున్నారు.
మిథున రాశి (Gemini) : ఎప్పుడూ చెలాకీగా ఉండే మిథున రాశి వారికి సహజంగానే అవకాశాలు పెద్ద ఎత్తున వస్తుంటాయి. అదే సమయంలో.. వారు వచ్చిన అవకాశాల్లో సరైనది ఎంపిక చేసుకోలేక, సరైన నిర్ణయాలు తీసుకోలేక.. ఇబ్బంది పడతారు. స్ల్పి్ట్ రాశి కావడం వల్ల ప్రతిసారీ కన్ఫ్యూజన్ ఉంటుంది. కొత్త సంవత్సరం మాత్రం వీరికి చాలా బాగుందని పండితులు చెబుతున్నారు. వీరి అంచనాలు కరెక్ట్ అవుతాయనీ, కలలు నెరవేరతాయనీ, ఆశలు ఫలిస్తాయని చెబుతున్నారు.