Multigrain Idlis - ఆవిరి ఇడ్లీలకు ఆయిల్‌తో పనిలేదు. మల్టీ గ్రెయిన్ ఇండ్లీ పౌడర్‌లో జొన్నలు, ఓట్స్, గోధుమలు, మెంతుల గింజలు, క్వినోవా, బక్ వీట్ గ్రోట్స్ వంటివి కలిసి ఉంటాయి. ఈ పౌడర్‌కు తాజా బఠాణీలు, కేరట్స్, నానబెట్టిన కాయధాన్యాల వంటివి కలిపి ఇడ్లీలు చేసుకుంటే... రుచి అదిరిపోవడమే కాదు... పోషకాలు కూడా బాగా అందుతాయి. (Image: Instagram)
Sprouts - మొలకలు జీవం ఉన్న ఆహారం. పుష్కలంగా ప్రోటీన్లూ, పోషక విలువలు కలిగివుంటాయి. వీటికి కొద్దిగా కట్ చేసిన దోసకాయ, టమాట, ఉల్లి, బెల్ పెప్పర్స్ వంటివి జోడించి... కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, కారం చల్లుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. వీటిలో మల్టీగ్రెయిన్ టాకో షెల్స్ కలిపి సలాడ్‌లా చేసుకొని తింటే ఇంకా మంచిది. (Image: Instagram)
Hard Boiled Eggs and Multi-Grain Bread - డయాబెటిస్ ఉన్నవారికి ఉడకబెట్టిన గుడ్లు చాలా మంచివి. వీటి వల్ల ప్రోటీన్స్ అందుతాయి... అదే సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉంటాయి. ఎందుకంటే గుడ్లు త్వరగా అరగవు. ఇవి శరీరానికి వెంటనే ఎక్కువ గ్లూకోజ్ అందకుండా చేస్తాయి. రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఓ మల్టీ గ్రెయిన్ బ్రెడ్ లేదా రోటీ లేదా తాజా కూరగాయలతో కలిపి తింటే... కొన్ని గంటలపాటూ ఆకలి వెయ్యదు. (Image: Instagram)