లింక్డ్ఇన్లో ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు, కావాల్సిన నైపుణ్యాలు తదితర వివరాలను పొందపర్చారు. వాటిని చూడొచ్చని సీఈవో అందులో పేర్కొన్నారు. జొమాటోలోని నాయకత్వ బృందాలను సమన్వయం చేసుకుంటూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్న ఆసక్తి కలిగిన అభ్యర్థులు జర్నలిస్ట్ పోస్టుకు అప్లై చేసుకోవచ్చని గోయెల్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
నిరంతరం ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహార సరఫరా జరిగేలా గ్రోత్ మేనేజర్లు పనిచేయాలని అందులో సూచించారు. మరో పోస్టులో.. ప్రొడక్ట్ మేనేజర్ల ఉద్యోగం. వీరు వినియోగదారుల అభిప్రాయాలు, సూచనలను స్వీకరించాల్సి ఉంటుంది. అనంతరం వీటిని విశ్లేషించి తదనుగుణంగా ఉత్పత్తులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ గ్రేడ్ 2/3 పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపాడు. కంపెనీ భవిష్యత్తు అప్లికేషన్లను, తర్వాతి తరం ఉత్పత్తుల్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుకు అర్హతలు, కావాల్సిన నైపుణ్యాల గురించి లింక్డ్ఇన్ని సంప్రదించొచ్చు. మొత్తం 800 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)