కరోనా (Corona) కారణంగా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ (Work from Home) సౌలభ్యాన్ని కల్పించాయి. దాదాపు రెండేళ్లుగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలోనే పనులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఉద్యోగులను ఆఫీస్‌లకు పిలిపించాలని కంపెనీలు భావిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ విషయంపై పెన్షన్లు, ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను జారీ చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఇండియాలో (India) వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని ఇక మీదట తీసేయాలని, ఉద్యోగులందరినీ కంపెనీలు (Company) తమ ఆఫీసులకు పిలవాలని సూచించింది. ఇక అందరు వర్క్ ఫ్రం హోం వీడి ఆఫీసుకి రావాలని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
దీంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్‌లకు పిలిపిస్తాయా లేదా ఇంటి నుంచి పనిని కంటిన్యూ చేస్తాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీసీఎస్ డిసెంబర్ లో ఇచ్చిన నోటిఫికేసన్ ప్రకారం కంపెనీ ఉద్యోగులు చాలామంది వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్నారని తెలిపింది. తమ ఉద్యోగుల భద్రతకు, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ ఆర్ హెడ్ రిచర్డ్ లోబో మాట్లాడుతూ... రాబోయే సంవత్సరంలో హైబ్రిడ్ మోడ్‌లో పని చేయనున్నట్లు తెలిపారు. కరోనా పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాత మాత్రమే తమ ఉద్యోగులను కార్యాలయాలకు పిలిచే ఆంశంపై చర్చిస్తామని హెచ్‌సీఎల్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)