కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) అనే వర్కింగ్ కల్చర్ పెరిగింది. లాక్డౌన్ సమయంలో అన్ని కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ చాలా సంస్థలు పూర్తిగా ఉద్యోగులను కార్యాలయాలకు పిలవలేదు. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌కు మారాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సమయంలో వర్క్‌స్పేస్‌లను కల్పించే వ్యాపారానికి డిమాండ్ కనిపిస్తోంది. ఉద్యోగులు సౌకర్యవంతంగా కూర్చుని పని చేసుకునే వాతావరణం అవసరం కనిపిస్తోంది. చాలా కాలం నుంచి వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి ఇలాంటి స్పేస్‌లు అవసరమని, లేదంటే మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
దీంతో పట్టణ కేంద్రాల్లో ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండే వర్క్‌స్పేస్‌లను కల్పించే ఫంక్షనల్, ఫ్లెక్సిబుల్ స్పేస్‌లకు డిమాండ్ పెరిగిందని రియల్ ఎస్టేట్ రీసెర్చ్ ఏజెన్సీ ‘CIRIL’ పేర్కొంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్‌లోని అనువైన వాతావరణంలో డెవలప్ చేయడానికి ఇదొక్క బిజినెస్ మాత్రమే కాదు.. ప్రాపర్టీ డెవలపర్లు, భూస్వాములు భవిష్యత్తులో హైబ్రిడ్ మోడల్ అవసరాల ఆధారంగా వ్యవస్థను సృష్టించే నమూనాను కోరుకుంటున్నారని CIRIL తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఎక్కువ మంది వర్క్‌ఫోర్స్, ఉద్యోగులు రిమోట్ లేదా ఫ్లెక్సిబుల్ వర్క్ ప్రాక్టీస్‌లను చేపట్టే అవకాశం ఉన్నందున, బిల్డింగ్ ఆక్యుపెన్సీ రేట్లు స్వల్పకాలంలో తగ్గవచ్చు. అయితే కో-వర్కింగ్, ఫ్లెక్సిబుల్ స్పేస్‌లు వంటి కొన్ని విభాగాలు వాణిజ్య, రియల్ఎస్టేట్లో ప్రధాన డిమాండ్‌గా మారతాయి.
(ప్రతీకాత్మక చిత్రం)
డెవలపర్లు, కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను పెంపొందించడం ద్వారా హైబ్రిడ్ వర్క్ కల్చర్ అవసరాలను పరిష్కరించడానికి కలిసి పని చేయాలి. చిన్న నగరాలు కస్టమర్లకు, పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా టైర్ II, టైర్ III నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని ఏజెన్సీ పేర్కొంది.
సాంప్రదాయకంగా.. IT, ITeS రంగాలు ఒక దశాబ్దం క్రితం హైబ్రిడ్ మోడళ్లతో ప్రయోగాలు చేయడంలో మొదటి మూవర్స్‌గా ఉన్నాయి. అప్పటి నుండి వారు శ్రామికశక్తికి మద్దతుగా ఒక బలమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. కరోనా విపత్తు అనంతర వ్యూహంగా ఇతర రంగాలు క్రమంగా హైబ్రిడ్ మోడళ్లకు అనుగుణంగా మారుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)