కరోనా తర్వాత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. రెండేళ్లుగా విడతల వారీగా విజృంభించిన మహమ్మారి కారణంగా పెద్ద కంపెనీలు ఉద్యోగులును ఆఫీసులకు పిలిపించడం కుదర్లేదు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిపోయింది. దీంతో ప్రముఖ ఇండియన్ ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్‌లకు పిలిపించాలని నిర్ణయించాయి. మరికొన్ని సంస్థలు హైబ్రిడ్ మోడల్‌కు రూపకల్పన చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ మోడల్ ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు తీసుకువచ్చేలా చేస్తుందని కంపెనీ భావిస్తోంది. ముందు ఉద్యోగులు ఆఫీస్‌లకు వస్తే, ఆ తర్వాత కంపెనీ హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు క్రమంగా మార్పు చేయనుంది. భారతదేశంలోని అతిపెద్ద IT కంపెనీగా టీసీఎస్.. తమ ఉద్యోగుల కోసం ఆపరేటింగ్ జోన్లు (OOZ), హాట్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ కంపెనీ తమ ఉద్యోగులను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఆఫీస్‌కు రావాలని కోరనున్నట్లు సమాచారం. ఉద్యోగులు ఆఫీస్‌లకు తిరిగి రావడం ప్రారంభించిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకోనుంది. కంపెనీ హైబ్రిడ్ మోడల్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోందన్నారు ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో. ఈ మోడల్లో దాదాపు 40-50 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేసే అవకాశం ఉందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
HCL వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్
HCL కూడా హైబ్రిడ్ మోడల్‌కు మారాలని నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, హైబ్రిడ్ మోడల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోందని HCL ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘మా వ్యాపారాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. తద్వారా మా క్లయింట్లకు ఎలాంటి అంతరాయాలు లేకుండా సేవలు అందిస్తాం’ అని సదరు ప్రతినిధిని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)