1. ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు అలర్ట్. విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ఉద్యోగాల భర్తీకి ఓ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ కంపెనీని వైజాగ్ స్టీల్ (Vizag Steel) అని కూడా పిలుస్తుంటారని తెలిసిందే. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న లైమ్స్టోమ్ మైన్స్‌లో పలు ఖాళీల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మైన్ ఫోర్‌మ్యాన్, మైనింగ్ మేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది వైజాగ్ స్టీల్. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు విశాఖపట్నంలో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలతో పాటు విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఇందులో మైన్ ఫోర్‌మ్యాన్ పోస్టు 1 ఉంది. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ పాస్ కావడంతో పాటు మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికెట్ ఉండాలి. మెకనైజ్డ్ ఓపెన్క్యాస్ట్ మెటాల్లిఫెరస్ మైన్స్‌లో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైనవారికి నెలకు రూ.39,000 వేతనం + రూ.1,750 హెచ్ఆర్ఏ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ పోస్టులకు 2022 జనవరి 26న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 9 చివరి తేదీ. అభ్యర్థులకు విద్యార్హతలతో పాటు అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 2022 జనవరి 1 నాటికి 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. మొదటి దశలో అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసి ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. రెండో దశలో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అభ్యర్థులకు ఆన్లైన్ టెస్టుకు సంబంధించిన వివరాల సమాచారం అందుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)