1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. కేంద్ర హోమ్ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ రీజనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసెస్లో రీసెర్చ్ ఆఫీసర్ (ఇంప్లిమెంటేషన్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. దేశంలోని ఎనిమిది రీజనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసుల్లో ఈ పోస్టులున్నాయి. ఢిల్లీ, ఘజియాబాద్, భోపాల్, ముంబై, కోల్‌కతా, గువాహతి, బెంగళూరు, కొచ్చిన్ ఈ ఆఫీసులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://upsconline.nic.in/ లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)