1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో (EPFO) పలు ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈపీఎఫ్ఓలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 577 ఖాళీలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులు 418 ఉండగా, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ పోస్టులు 159 ఉన్నాయి. ఈ పోస్టులకు 2023 ఫిబ్రవరి 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2023 మార్చి 17 చివరి తేదీ. అడ్మిట్ కార్డుల విడుదల, పరీక్ష తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయితే చాలు. అభ్యర్థుల వయస్సు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. వేర్వేరు పోస్టులకు అప్లికేషన్ లింక్స్ వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థి ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ పైన క్లిక్ చేయాలి. New Registration పైన క్లిక్ చేసి అభ్యర్థి తన వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)