1. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) జూన్ 5న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షల్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ పరీక్షకు ఈసారి 8 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన మూడు వారాల లోపే సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది యూపీఎస్సీ. (ప్రతీకాత్మక చిత్రం)
2. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ లో లేదా యూపీఎస్సీకి చెందిన మరో వెబ్సైట్ https://upsconline.nic.in/ లో కూడా ఫలితాలు చెక్ చేయొచ్చు. ఈ వెబ్సైట్స్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో Result - CIVIL SERVICES (PRELIMINARY) EXAMINATION, 2022 లింక్ పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమ రోల్ నెంబర్ సెర్చ్ చేసి ఫలితాలు చూడొచ్చు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవారికి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ని త్వరలోనే విడుదల చేయనుంది యూపీఎస్సీ. సివిల్ సర్వీసెస్ ఫలితాలతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ రిజల్ట్స్ కూడా విడుదలయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవారు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 1 పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన తేదీలు, నియమనిబంధనల్ని యూపీఎస్సీ త్వరలోనే వెల్లడించనుంది. యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ఫాలో కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ప్రాసెస్ పూర్తైన తర్వాత, తుది ఫలితాలు విడుదలైన తర్వాత ప్రిలిమ్స్ మార్కులు, కటాఫ్ మార్క్స్, ఆన్సర్ కీస్ https://www.upsc.gov.in/ వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది యూపీఎస్సీ. సందేహాలు, అనుమానాలు ఉన్న అభ్యర్థులు యూపీఎస్సీ అధికారుల్ని సంప్రదించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)