5. ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 345 ఖాళీలు ఉండగా అందులో ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్- 100, ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల- 26, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్- 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (పురుషులు)- 170, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మహిళలు)- 17 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. విద్యార్హత వివరాలు చూస్తే ఐఎంఏ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ-చెన్నై కోసం డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీ కోసం ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు డిగ్రీ పాస్ కావాలి. లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
8. అభ్యర్థులు నోటిఫికేషన్ చదివిన తర్వాత https://upsconline.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC లింక్ క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Combined Defence Services Examination (I) నోటిఫికేషన్ కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. Part-I Registration రిజిస్ట్రేషన్ చేసేందుకు లింక్ పైన క్లిక్ చేయాలి. మీ వివరాలతో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేసి పూర్తి చేయాలి. ఫోటో, సంతకం అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)