1. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) ఎగ్జామినేషన్ 1-2022 నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది యూపీఎస్సీ. మొత్తం 341 ఖాళీలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 341 ఖాళీలు ఉండగా ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్- 100, ఇండియన్ నావల్ అకాడమీ, ఎఝిమల- 22, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్- 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మెన్)- 170, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (వుమెన్)- 17 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. విద్యార్హతల వివరాలు చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేసే అభ్యర్థులు 10+2 లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పాస్ కావాలి. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. అభ్యర్థుల మిలిటరీ అకాడమీ, నావల్ అకాడమీకి అప్లై చేసేవారు 1999 జనవరి 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారై ఉండాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి దరఖాస్తు చేసే అభ్యర్థులు 1998 జనవరి 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేసేవారికి 2023 జనవరి 1 నాటికి 20 నుంచి 24 ఏళ్లు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://upsconline.nic.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC లింక్ క్లిక్ చేయాలి. లిస్ట్‌లో Combined Defence Services Examination (I) నోటిఫికేషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మొదట Click Here for PART I పైన క్లిక్ చేయాలి. పార్ట్ 1 రిజిస్ట్రేషన్‌లో అభ్యర్థి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ కోసం Click Here for Part II పైన క్లిక్ చేయాలి. ఫీజ్ పేమెంట్ చేసి, ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)