Good News | Banks: ఖాతాదారులకు గుడ్ న్యూస్ ..జనవరి 30, 31 తేదీల్లో పని చేయనున్న బ్యాంక్‌లు
Good News | Banks: ఖాతాదారులకు గుడ్ న్యూస్ ..జనవరి 30, 31 తేదీల్లో పని చేయనున్న బ్యాంక్‌లు
GOOD NEWS| BANKS:డిమాండ్ల పరిష్కారం కోసం రెండ్రోలు సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంక్ ఉద్యోగులు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే 31వ తేది చర్చలకు ఆహ్వానించడం వల్లే ఈసమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది.
ప్రజలకు శుభవార్త. సోమవారం, మంగళవారం బ్యాంక్‌లు యధావిధిగా పని చేయనున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంక్ ఉద్యోగులు మొదట రెండ్రోజుల పాటు సమ్మె చేయాలని భావించారు.అయితే ఆ నిర్ణయం వాయిదా పడింది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 9
దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జనవరి 30,31 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ బ్యాంక్ యూనియన్స్(UFBI) ఈవిషయాన్ని ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 9
ఐదు రోజుల పని దినాలు, ఎన్పీఎస్ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, కాళీగా ఉన్న విభాగాల్లో నియామకాలు వంటి డిమాండ్లతో పాటు మరికొన్ని సమస్యలపై బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 9
అయితే అనుకున్న ప్రకారం రేపు, ఎల్లుండి చేపట్టాల్సిన సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నట్లుగా శనివారం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ బ్యాంక్ యూనియన్స్(UFBI)ప్రకటించింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 9
బ్యాంక్ యూనియన్ల డిమాండ్లపై చర్చించేందుకు ఈనెల 31న సమావేశం అయ్యేందుకు ఇండియన్ బ్యాంక్స్ ఆఫ్ అసోసియేషన్ అంగీకరించింది. ఈనేపధ్యంలోనే ఉద్యోగులు సమ్మెను వాయిదా వేసుకున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 9
దీంతో చర్చలు జరిపేందుకు అనుగూణంగా సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ శనివారం ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో బ్యాంకు ఉద్యోగులు సేవలందించనున్నారు.(ప్రతీకాత్మకచిత్రం)
7/ 9
6. బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాదారులు యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లాంటి సేవల్ని వాడుకోవచ్చు. ఈ సేవలు సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
దీని కారణంగానే జనవరి మాసం చివరి రెండ్రోజులు కూడా ఖాతాదారులు, ప్రజలకు బ్యాంక్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొనడం జరిగింది. ఆర్ధిక లావాదేవీలు ఆగిపోతాయని భావించిన ఖాతాదారులు, కస్టమర్లకు ఇదొక గుడ్ న్యూస్‌గా భావించాలి. (ప్రతీకాత్మకచిత్రం)
9/ 9
ఫిబ్రవరి నెలలో కూడా రోజులు తక్కువగా ఉండటం..సెలవు దినాలు ఎక్కువగా రావడంతో ఉద్యోగ సంఘాల నిర్ణయం ఖాతాదారులకు ఓ రకంగా ఊరటనిచ్చినట్లైంది. ఆర్దిక లావాదేవీలను ఈ రెండ్రోజుల్లో పూర్తి చేసుకోవచ్చని ఊపిరి పీల్చుకుంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)